ETV Bharat / state

Delhi Liquor Scam: అభిషేక్‌ వెనుక ప్రముఖులు.. సీబీఐ నెక్ట్స్​ టార్గెట్ వారే!

Delhi liquor scam దిల్లీ మద్యం ముడుపుల కేసులో అరెస్టైన బోయినపల్లి అభిషేక్‌ వెనక ఎవరున్నారనే కోణంలో సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. అతడి వెనుక అనేకమంది ప్రముఖులు ఉన్నట్లు పసిగట్టింది. అభిషేక్‌ ద్వారానే ఆ విషయాలను చెప్పించి.... చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీబీఐ రంగంసిద్ధం చేస్తోంది. హవాలా ద్వారా మద్యం ముడుపుల చెల్లింపులకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది.

Delhi liquor scam case
Delhi liquor scam case
author img

By

Published : Oct 12, 2022, 7:12 AM IST

Delhi liquor scam సంచలనం సృష్టిస్తున్న దిల్లీ మద్యం ముడుపుల కేసులో సీబీఐ చేసిన రెండో అరెస్టే రాష్ట్రానికి చెందిన అభిషేక్‌ది కావడం... కీలకంగా మారింది. మద్యం కుంభకోణంలో తెలంగాణకు చెందిన వారు కీలకపాత్ర పోషించారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో దిల్లీ తర్వాత హైదరాబాద్‌లోనే ఎక్కువగా సోదాలు జరిగాయి. సీబీఐ ఒకసారి, ఈడీ నాలుగుసార్లు ఇక్కడ సోదాలు చేశాయి. పలుమార్లు విచారణ చేసిన అనంతరం సీబీఐ అభిషేక్‌ను అరెస్టు చేసింది. కుంభకోణంలో అసలు సూత్రధారుల వివరాలు రాబట్టేందుకు ఆయనను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌లో కీలక విషయాలు పేర్కొంది.

అభిషేక్‌ బ్యాంకు ఖాతాలు పరిశీలించినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని సీబీఐ తెలిపింది. ఈ కేసులో నిందితులు సహా మద్యం వ్యాపారులతో పలుమార్లు దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లలో సమావేశమైన అభిషేక్‌... కుట్రలో భాగమైనట్లు పేర్కొంది. లిక్కర్‌ పాలసీ అమలులోకి రాకముందే ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌నాయర్‌కు.. మరో నిందితుడు దినేష్‌ అరోరా ద్వారా హవాలా మార్గంలో డబ్బు పంపారు. ఇంకో నిందితుడిగా ఉన్న ఇండో స్పిరిట్స్‌ సంస్థకు చెందిన సమీర్‌ మహేంద్రు నుంచి కొంత డబ్బు అభిషేక్‌ ఖాతాలో జమ అయ్యింది. ఈ డబ్బు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు అభిషేక్‌ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినప్పటికీ జవాబులు చెప్పేందుకు అభిషేక్‌ తడబడ్డట్లు సీబీఐ తెలిపింది. నిజాలు దాస్తురనే అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు స్పష్టంచేసింది.

బోయినపల్లి అభిషేక్‌ వెనుక ఎవరున్నారో ఆరా తీసే దిశగా సీబీఐ ముందుకు సాగుతోంది. ఆ విషయాన్ని ఆయనతోనే చెప్పించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవడమే సీబీఐ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో నిందితుడు అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లైకి అభిషేక్‌ వ్యాపార భాగస్వామి. వీరిద్దరికీ ముఖ్యంగా అభిషేక్‌కు రాష్ట్రంలోని అనేకమంది ప్రముఖులతో సత్సంబంధాలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లావాదేవీలకు సంబంధించి సీబీఐ బలమైన ఆధారాలే సేకరించినట్లు తెలుస్తోంది. కస్టడీలో అభిషేక్‌ ఎవరి పేర్లు చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. దిల్లీ మద్యం పాలసీ కేసులో ఆంధ్రప్రభ ఎడిటర్‌ ముత్తా గౌతమ్‌కు ఈడీ మంగళవారం సమన్లు జారీ చేసింది.

కస్టడీ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్న ప్రధానాంశాలు..

* ‘సాక్షులను విచారించి, నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసి, అభిషేక్‌ బ్యాంకు ఖాతాలు పరిశీలించినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

* మద్యం పాలసీ (విధాన) రూపకల్పనకు, దాని ద్వారా లబ్ధి పొందేందుకు నిందితులు, మద్యం వ్యాపారులతో అభిషేక్‌ పలుమార్లు దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లలో సమావేశమయ్యారు.

* ఈ కుట్రలో అభిషేక్‌ భాగమయ్యారు. లిక్కర్‌ పాలసీ అమలులోకి రాకముందే ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌నాయర్‌కు.. మరో నిందితుడు దినేష్‌ అరోరా ద్వారా హవాలా మార్గంలో డబ్బు పంపారు.

* ఇంకో నిందితుడిగా ఉన్న ఇండో స్పిరిట్స్‌ సంస్థకు చెందిన సమీర్‌ మహేంద్రు నుంచి కొంత డబ్బు అభిషేక్‌ ఖాతాలో జమ అయ్యింది. ఈ డబ్బు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు అభిషేక్‌ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు.

* మద్యం కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు కుట్రలో అభిషేక్‌ పేరు కూడా ఉన్నట్లు వెల్లడైంది. దాంతో ఆయనను పలుమార్లు సీబీఐ కార్యాలయానికి పిలిపించి విచారించాం.

* ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినప్పటికీ జవాబులు చెప్పేందుకు ఆయన తడబడ్డారు. పాత విషయాలు గుర్తు చేసుకునేందుకు కొంత సమయం కోరారు.

* కావాల్సినంత సమయం ఇచ్చినా, ఆయన దర్యాప్తు సంస్థకు సహకరించలేదు. పైగా హవాలా ద్వారా తాను పంపిన నగదు గురించి, కుట్రతో సంబంధం ఉన్న వారి గురించి చెప్పలేదు. నిజాలు దాస్తున్నారు. అందుకే ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చింది.

* ఈ కేసులో నిధుల మళ్లింపుతోపాటు నిందితుల పాత్రను నిరూపించడం, మొత్తంగా కుట్రను బహిర్గతం చేసేందుకు అభిషేక్‌ను విచారించాలి కనుక ఆయనను కస్టడీకి ఇవ్వండి’ అని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది.

ఆంధ్రప్రభ ఎడిటర్‌ ముత్తా గౌతమ్‌కు ఈడీ సమన్లు

దిల్లీ మద్యం పాలసీ కేసులో ఆంధ్రప్రభ ఎడిటర్‌ ముత్తా గౌతమ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజే గౌతమ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. దిల్లీ, పంజాబ్‌, హైదరాబాద్‌లలోని ఆంధ్రప్రభ, ఇండియా ఎహెడ్‌కు చెందిన 35 ప్రాంతాల్లో ఈ నెల ఏడో తేదీన ఈడీ సోదాలు చేసింది. ఆ సందర్భంగా పలు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించినట్లు సమాచారం.

ఇవీ చూడండి:

ఈ 'ముంపు' కష్టాలు ఇంకెన్నాళ్లు.. పరిష్కారానికి ఇంకెప్పుడు..?

దేశంలోనే అతిపెద్ద అక్వేరియం ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నాం: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.