ETV Bharat / state

ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ.. నేడే విచారణ

CBI inquiry on MLC Kavitha today: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి ఇవాళ సీబీఐ బృందం వెళ్లనుంది. కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు సీబీఐ వెల్లడించింది. సాక్షిగా విచారణ జరిపేందుకు.. కవితకు సీబీఐ ఇప్పటికే సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చింది. కవితకు సంఘీభావంగా బీఆర్​ఎస్​ శ్రేణులు ఆమె నివాసం పరిసరాల్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టారు. సీబీఐ విచారణ, ఆ తర్వాత పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత బీఆర్​ఎస్​ ముఖ్య నేతలు, న్యాయ నిపుణులతో చర్చించారు.

mlc kavitha
ఎమ్మెల్సీ కవిత
author img

By

Published : Dec 11, 2022, 6:36 AM IST

కవిత ఇంటికి సీబీఐ

CBI inquiry on MLC Kavitha today: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణంలో.. సీబీఐ ఇవాళ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనుంది. వాంగ్మూలం నమోదు చేయనున్నారు. దిల్లీ సీబీఐ అధికారులు ఈనెల 2న సీఆర్​పీసీ 160 ప్రకారం నోటీసు ఇచ్చారు. మద్యం కేసుకు సంబంధించిన కొన్ని వివరాలుకావాలని.. హైదరాబాద్ లేదా దిల్లీలో ఎక్కడ వీలవుతుందో చెప్పాలన్న దర్యాప్తు అధికారులు.. ఈనెల 6న కవితను ప్రశ్నించాలని భావించారు. అయితే ఎఫ్ఐఆర్, ఫిర్యాదు ప్రతి ఇస్తే తగిన సమాధానాలు చెప్పగలనని ఈనెల 3న ఆమె.. సీబీఐకి మెయిల్ పంపించారు.

ఎఫ్ఐఆర్, ఫిర్యాదు వెబ్‌సైట్‌లో ఉన్నాయని సీబీఐ ఈనెల 4న ప్రత్యుత్తరం ఇచ్చింది. ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేకపోయినప్పటికీ.. చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తిగా విచారణకు సిద్ధమన్నారు. అయితే 6వ తేదీన ముందుగా ఖరారైన కొన్ని కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు వీలుకాదని.. కవిత సమాచారం ఇచ్చారు. ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని తన నివాసానికి రావొచ్చని.. సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈనెల 11న ప్రశ్నిస్తామని దర్యాప్తు అధికారులు పేర్కొనగా.. కవిత అంగీకరించారు. దిల్లీ నుంచి సీబీఐ డీఎస్పీ నేతృత్వంలో అధికారుల బృందం ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదు చేయనుంది.

సీబీఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత శనివారం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌.. కవితతో మాట్లాడినట్లు సమాచారం. రాజకీయ కక్షతో ఇబ్బందులు పెట్టేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించవని, సీబీఐ విచారణ అందులో భాగమేనని కేసీఆర్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీబీఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించినట్లు సమాచారం. ఇవాళ పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ తమ ఇంటికి రావద్దని కవిత కోరినట్లు తెలుస్తోంది. ఆమె ఇంటిమార్గంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. కవిత నివాసం వద్ద బీఆర్​ఎస్​ నేతలు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌.. విల్‌ నెవర్‌ ఫియర్‌ అని వాటిపై రాశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.