ETV Bharat / state

వైఎస్​ వివేకా హత్యకేసు... సీబీఐ అనుమానితుల జాబితాలో 15 మంది! - వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వార్తలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ చేపట్టిన సీబీఐ.. అనుమానితుల జాబితాలో 15 మందిని చేర్చినట్లు తెలుస్తోంది. వీరిలో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్​ కడప కేంద్రంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు త్వరలోనే వీరిని పిలిపించి విచారించే అవకాశం ఉంది.

cbi-enquiry-on-ys-viveka-murder-case
వైఎస్​ వివేకా హత్యకేసు... సీబీఐ అనుమానితుల జాబితాలో 15 మంది!
author img

By

Published : Jul 27, 2020, 6:08 PM IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లా కేంద్రంగా విచారణ చేపట్టనుంది. 10 రోజులపాటు పులివెందులలో ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అధికారులు వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించారు. సిట్ దర్యాప్తు నివేదికను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. 3 సంచుల్లో ఉన్న నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు ఈరోజు నుంచి ప్రత్యేక విచారణ అధికారి సమక్షంలో విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు కడప ఆర్అండ్​బీ అతిథి గృహానికి అధికారులు చేరుకున్నారు.

అక్కడే దస్త్రాలను పరిశీలించి.. అనుమానితులను పిలిపించి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే 15 మంది అనుమానితుల జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ జాబితాలో వైఎస్​ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, బాబాయ్ మనోహర్ రెడ్డితో పాటు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చూడండి: రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.