ETV Bharat / state

కుల వివాదం: క్లారిటీ ఇచ్చిన ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

కుల వివాద ఆరోపణలపై ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి క్లారిటీ ఇచ్చారు. తన స్వస్థలం టి.డి పారాపురం వెళ్లి ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చని చెప్పారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు.

dy cm pushpa sreevani
dy cm pushpa sreevani
author img

By

Published : Apr 20, 2021, 10:48 PM IST

కుల వివాదం: క్లారిటీ ఇచ్చిన ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

తనపై వస్తున్న కుల వివాద ఆరోపణలపై ఏపీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి వివరణ ఇచ్చారు. తాను ఎస్టీ కొండదొర కులంలో జన్మించానని చెప్పారు. తాను ఎస్టీ కాదని కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారన్న పుష్పశ్రీవాణి.. తన సోదరి వెంకటరామతులసికి 2008 స్పెషల్ డీఎస్సీలో ఎస్టీ కాకపోవడం వల్లే ఉద్యోగం రాలేదనే ఆరోపణల్లో వాస్తవం లేదని వివరించారు. జీవో నంబర్ 3 ప్రకారం.. కేవలం స్థానికులకే ఆ ఉద్యోగానికి అర్హత ఉంటుందని స్పష్టం చేశారు.

తమ కుటుంబం వలస రావడం కారణంగా స్థానికేతరులనే కారణంతో ఉద్యోగం కోల్పోయిందని శ్రీవాణి పేర్కొన్నారు. 2014లో కుటుంబం మొత్తం ఎస్టీ సర్టిఫికెట్ చేయించుకున్నామని స్పష్టం చేశారు. ఆ సమయానికి రాజకీయాలంటే ఏమిటో తనకు తెలియదని వివరణ ఇచ్చారు. తాత, తండ్రుల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని టి.డి పారాపురం అని.. ఆ ఊరు వెళ్లి విచారణ చేస్తే.. ఎవరైనా తమ కులం గురించి చెబుతారని తెలిపారు.

కొంతమంది కావాలనే నాపై రాజకీయ కుట్ర చేస్తున్నారు. విచారణలో వాస్తవాలేమిటో త్వరలోనే తెలుస్తాయి. నా కులంపై వస్తున్న ఆరోపణ పట్ల అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు. మా సొంతూరుకు వెళ్లి ఎవరైనా ఎంక్వైరీ చేయవచ్చు. అదేపనిగా ఆరోపణలు చేసేవారికి త్వరలోనే క్లారిటీ వస్తుంది.

-పుష్పశ్రీవాణి, ఏపీ ఉపముఖ్యమంత్రి

ఇదీ చూడండి: మద్యం దుకాణాల ఎదుట ముందుబాబులు క్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.