ETV Bharat / state

కాచిగూడ ఎంఎంటీఎస్​ లోకో​పైలట్​పై కేసులు నమోదు - KACHIGUDA TRAIN ACCIDENT news

హైదరాబాద్​ కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్​ లోకో పైలట్​ చంద్రశేఖర్​ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతను కేర్​ ఆసుపత్రిలో వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాచిగూడ ఎంఎంటీఎస్​ లోక్​పైలట్​పై కేసులు నమోదు
author img

By

Published : Nov 12, 2019, 7:57 PM IST

కాచిగూడ ఎంఎంటీఎస్​ లోకో​పైలట్​పై కేసులు నమోదు
కాచిగూడ ఎంఎంటీఎస్​ రైలు ప్రమాదంపై రైల్వే పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. కాచిగూడ రైల్వేస్టేషన్​ మేనేజర్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు లోకోపైలెట్​ చంద్రశేఖర్​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రయాణికుల ప్రాణానికి ముప్పు కలిగించేలా వ్యవహరించినందుకు లోకోపైలెట్​పై ఐపీసీ 308, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

లోకోపైలెట్​ వాంగ్మూలం కీలకం

ఈ కేసులో చంద్రశేఖర్​ వాంగ్మూలం కూడా కీలకంగా మారనుంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల పోలీసులు అతను కోలుకున్నాక వాంగ్మూలం తీసుకోవాలని భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి మరిన్ని వివరాలు సేకరించారు. సిగ్నలింగ్‌ వ్యవస్థ గురించి పోలీసులు.. రైల్వే ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.

వెంటిలేటర్​పై చికిత్స

ప్రస్తుతం చంద్రశేఖర్​ నాంపల్లి కేర్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతని మూత్రపిండాలకు గాయాలయ్యాయని, రెండు కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోయిందని చెప్పారు. వెంటిలేటర్​పై చికిత్స కొనసాగుతోందని వివరించారు. చంద్రశేఖర్​ ఒంటిపై చాలా గాయాలయ్యాయని తెలిపారు. మరో 24 గంటలు గడిచిన తర్వాత అతనికి పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స చేస్తామని స్పష్టం చేసారు.

మరో ఐదుగురూ ఆసుపత్రిలోనే..

ప్రమాదంలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికులు సాజిద్​, శేఖర్​, బాలేశ్వరమ్మ, రాజ్​కుమార్​, మహ్మద్​ ఇబ్రహీంను రైల్వే అధికారులు కేర్​ ఆసుపత్రికి తరలించారు. కొందరికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. గాయాలపాలైన వారి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని వివరించారు.

ఆరోగ్యం మెరుగుపడిన తర్వాతే..

రైలు ప్రమాద ఘటనలో పోలీసులు లోకో పైలెట్‌ చంద్రశేఖర్‌ నుంచి తీసుకునే వాంగ్మూలం కీలకం కానుంది. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాతనే వాంగ్మూలం తీసుకోవాలని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.

ఇవీచూడండి: విహారయాత్రకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

TG_HYD_32_12_RAILWAY_ACCIDENT_INJURED_OVERALL_PKG_3066407 REPORTER:K.SRINIVAS ( )కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్‌ లోకో పైలెట్‌ చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతను కేర్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు మరో అయిదుగురు ప్రయాణికులు చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు....LOOOK V.O:ఎంఎంటీఎస్‌ రైలు ప్రమాదం పై రైల్వే పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు లోకోపైలెట్‌ చంద్రశేఖర్‌పై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ప్రయాణికుల ప్రాణానికి ముప్పు కలిగించేలా వ్యవరించినందుకు లోకో పైలెట్‌పై ఐపిసి 308, 337, 338 సెక్షన్‌ల కింద కేసు నమోదయింది. ఈ కేసులో అతని వాంగ్మూలం కూడా కీలకంగా మారనుంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు అతను కోలుకున్నాక వాంగ్మూలం తీసుకోవాలని భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి మరిన్ని వివరాలు సేకరించారు. సిగ్నలింగ్‌ వ్యవస్థ గురించి పోలీసులు రైల్వే ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. V.O:ప్రస్తుతం చంద్రశేఖర్‌ నాంపల్లి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అతని మూత్రపిండాలకు గాయాలయ్యాయని, రెండు కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోయిందని చెప్పారు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని వివరించారు. చంద్రశేఖర్‌ ఒంటిపై మొత్తం గాయాలయ్యాయని తెలిపారు. మరో 24 గంటలు గడిచిన తర్వాత అతనికి పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స చేస్తామని చెప్పారు. ప్రమాదంలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న... ప్రయాణికులు సాజిద్‌, శేఖర్‌, బాలేశ్వరమ్మ, రాజ్‌కుమార్‌, మహ్మద్‌ ఇబ్రహింను రైల్వే అధికారులు కేర్‌ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొందరికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. గాయాలపాలైన వారి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని వైద్యులు వివరించారు. బైట్‌:సుష్మ, కేర్‌ ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ E.V.O:రైలు ప్రమాద సంఘటనలో పోలీసులు లోకో పైలెట్‌ చంద్రశేఖర్‌ నుంచి తీసుకునే వాంగ్మూలం కీలకం కానుంది. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాతనే వాంగ్మూలం తీసుకోవాలని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.