గ్రామానికి తెరాస అధ్యక్షుడు అంటూ ఒకరు.. తెరాస స్టేట్ యూత్ వింగ్ అంటూ మరొకరు.. ఇలా ఇద్దరు రెండు కార్లలో ఎలాంటి అనుమతి లేకున్నా.. రోడ్లపై ఇష్టారితీనా తిరుగుతుండగా పోలీసుల తనీఖీల్లో పట్టుబడ్డారు. హైదరాబాద్ షాపూర్ నగర్ చెక్ పోస్ట్ వద్ద బాలానగర్ ఏసీపీ పురుషోత్తం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒకరు మల్కాపూర్ గ్రామానికి తెరాస అధ్యక్షుడు అంటూ.. రోడ్డుపై తిరుగుతున్నాడు.
పోలీసుల అతన్ని ఆపి ప్రశ్నించగా.. భయంలేకుండా అధ్యక్షుడిని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీనితో వాహనాన్ని సీజ్ చేసి.. కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: 'బ్లాక్ ఫంగస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'