ETV Bharat / state

బాధ్యతగా ఉండకపోతే... తప్పదు భారీ మూల్యం

తీరు మార్చుకోకపోతే తలరాతే మారిపోతుందని ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు.. కోరలు చాస్తున్న కరోనాకు చిక్కావో నీతో పాటు ఎంతమందిని కబళించేస్తుందో లెక్కేయలేమని మొత్తుకున్నా బుద్ధిమారడం లేదు. లాక్​డౌన్​ అమలులో ఉన్నా యథేచ్ఛగా రోడ్లపై సంచరిస్తున్నారు. అలాంటి వారిని సాంకేతిక సహాయంతో పట్టుకుని వాహనాలు సీజ్​ చేస్తున్నారు పోలీసులు.

author img

By

Published : Mar 28, 2020, 5:37 AM IST

Cases against violators of traffic rules during lockdown
బాధ్యతగా ఉండకపోతే... తప్పదు భారీ మూల్యం
బాధ్యతగా ఉండకపోతే... తప్పదు భారీ మూల్యం

లాక్​డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించొద్దని ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. నచ్చజెప్పినా... లాఠీలకు పనిచెప్పినా ఎంత మందినని కట్టడి చేయగలరు. బాధ్యతగా ఉండాల్సిన పౌరులు బుద్ధి మార్చుకోకపోతే... భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

రోజురోజుకు పెరుగుతున్నాయి

రెండు రోజులుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వేలల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై సాంకేతికతను వాడి కేసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 25న 7,497... 26న 9వేలు.. 27న 8,500 కేసుల నమోదు చేశారు. వీటితో పాటు సాధారణ తనిఖీల్లో మరో 2,312 వాహనాలు పట్టుబడ్డాయి. ఇప్పటి వరకు 683 వాహనాలను సీజ్​ చేశారు.

సాంకేతికత సాయంతో..

ప్రధాన కూడళ్ళు, సిగ్నళ్ళ వద్ద విధించే చలాన్లు కాకుండా తమ ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు దాటితే అటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్(ఎఎన్​పీఆర్)తో కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున అనవసరంగా రోడ్లపైకి రావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనాకు మందు లేదు.. ఓ ఆయుధం ఉంది: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.