ETV Bharat / state

మాజీ డిప్యూటీ మేయర్​ బాబా ఫసియుద్దీన్​ కోసం పోలీసుల గాలింపు - ఆయన స్పందన ఏంటంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 2:30 PM IST

Case Registered Against Hyderabad EX Deputy Mayor Baba Fasiuddin : హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్​పై కేసు నమోదైంది. ఆయన కోసం నారాయణపేట జిల్లాలోని కోస్గి పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై బాబా ఫసియుద్దీన్ స్పందించారు.

Case Registered Against Kodangal EX MLA Patnam Narender Reddy
Case Registered Against Hyderabad EX Deputy Mayor Baba Fasiuddin

Case Registered Against EX Deputy Mayor Of Hyderabad Baba Fasiuddin : హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కోసం నారాయణపేట జిల్లాలోని కోస్గి పోలీసులు గాలిస్తున్నారు. బోరబండ పోలీసులతో సాయంతో రెండు రోజుల నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా బాబా ఫసియుద్దీన్​​కు బీఆర్​ఎస్​ పార్టీ నారాయణపేట జిల్లా బాధ్యతలను అప్పగించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే చంపేస్తామంటూ బెదిరించి, దాడి చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆ గ్రామ ఎన్నికల్లో పోటీ చేస్తే భార్యలు చనిపోతారట! ఎలక్షన్​ అంటేనే గజగజ!!

Case Registered Against Kodangal EX MLA Patnam Narender Reddy : బాధితుడి ఫిర్యాదు మేరకు 9 మందిపైన కేసు నమోదు చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎం.రాజేశ్, వెంకట నర్సింలు, కోనేరు సాయప్ప, బాలేశ్, హితేశ్, రాజేందర్ రెడ్డి, అమీర్ షేక్, బాబా ఫసియుద్దీన్​ల పైనా కోస్గి పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపైన పలు సెక్షన్​ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కేసులో భాగంగా బాబా ఫసియుద్దీన్ కోసం తన నివాసంతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

ఇదంతా అసత్య ప్రచారం : పోలీసులు తన కోసం గాలిస్తున్నారంటూ, తాను పరారీలో ఉన్నానంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో కోస్గి బీఆర్​ఎస్​ ఇన్ ఛార్జ్ ఉన్నందున ఇరు పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు అయిందని, అందులో తన పేరు కూడా ఉందని ఆయన వివరణ ఇచ్చారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం - శాసనసభా వేదికగా లెక్కతేల్చనున్న ప్రభుత్వం

కేసులను న్యాయ పరంగా ఎదుర్కొంటా : ఆ కేసు నమోదై దాదాపు 20 రోజుల పైనే అవుతుందని, కొంతమంది కొత్తగా దాన్ని తెరపైకి తీసుకువచ్చి తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని వాపోయారు. పోలీసులు తన ఇంటికి రాలేదని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీ నేతలపై కేసులు నమోదవడం సహజమని చెప్పారు. ఉద్యమకారులు కేసులకు భయపడి పారిపోరని గుర్తు చేశారు. తాను తెలంగాణ ఉద్యమకారుడినని ఎలాంటి కేసులైన న్యాయపరంగా ఎదుర్కొంటానని బాబా ఫసియుద్దీన్​ అన్నారు.

'కేంద్రం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోంది'- సస్పెన్షన్​ వేటుపై పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీల నిరసన

10మందితో వద్దు- సైలెంట్ వాకింగ్ ముద్దు- ఫుల్ హెల్త్ బెనిఫిట్స్​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.