కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ... తెరాస కంటోన్మెంట్ నాయకుడు బొట్టు ప్రభాకర్ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం నిధులను ఎమ్మెల్యే దుర్వినియోగం చేస్తున్నాడని... సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినందుకు తనపై దాడి చేయించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తెరాస ఆవిర్భావం నుంచి తాను ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్నానని... ఉద్యమకారులకు పార్టీలో భద్రత కరవైందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై అక్టోబర్ 27వ తేదీన దాడి జరిగితే... మారేడ్పల్లి పోలీసులు ఇప్పటికీ దాడి చేసిన వారిని అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన చేసిన వారిపై చర్యలు తీసుకొని ... ఎమ్మెల్యే సాయన్న నుంచి ప్రాణరక్షణ కల్పించాలన్నాడు.
ఇదీ చూడండి: రెండు నెలల్లో... రెండు ఏటీఎంలలో... లక్షల్లో చోరీ