ETV Bharat / state

ప్రజాధనం కాజేశారని... ముగ్గురిపై కేసు నమోదు - Case filed against these three in illegal money release case

జగన్ అక్రమాస్తుల కేసులో తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ నిధులు కాజేశారని విశ్రాంత ఐఏఎస్ అధికారి సీవీఎస్​కే శర్మపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ సీఎస్ పీకే మహంతి, పీవీ రమేశ్​లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సీవీఎస్​కే శర్మ, మాజీ సీఎస్ పీకే మహంతి, పీవీ రమేశ్​లపై కేసు నమోదు
author img

By

Published : Nov 1, 2019, 5:23 AM IST

Updated : Nov 1, 2019, 8:55 AM IST

సీవీఎస్​కే శర్మ, మాజీ సీఎస్ పీకే మహంతి, పీవీ రమేశ్​లపై కేసు నమోదు
జగన్ అక్రమాస్తుల కేసులో న్యాయ సలహాల ఖర్చుల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి సీవీఎస్​కే శర్మపై కేసు నమోదైంది. తప్పుడు రశీదులు సృష్టించి బిల్లులు కాజేశారని హైదరాబాద్ పోలీసులు​ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో సహకరించారని అప్పటి సీఎస్ పీకే మహంతి, ఏపీ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేశ్​పై కూడా కేసు నమోదు చేశారు. జేడీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ రమణ దాఖలు చేసిన ఫిర్యాదులో నాంపల్లి కోర్టు జారీ చేసిన ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

జగన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన ఓ వ్యాజ్యంలో... న్యాయ సలహాల నిమిత్తం నిధులివ్వాలని 2014లో కొందరు ఐఏఎస్ అధికారులు కోరారు. దీనికి అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. సీవీఎస్​కే శర్మ... న్యాయవాదికి ఫీజు చెల్లించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ప్రజాధనం కాజేశారని ఆరోపిస్తూ ఏవీ రమణ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో 7 లక్షల 56 వేల రూపాయల బిల్లులను మంజూరు చేయడంలో పీకే మహంతి, పీవీ రమేశ్ ప్రమేయం కూడా ఉందని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన నాంపల్లి కోర్టు... సీవీఎస్​కే శర్మ, పీకే మహంతి, పీవీ రమేశ్​లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ముగ్గురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి : ఒక్క నెలలోనే రూ.1,650 కోట్ల మద్యం తాగేశారు

TG_HYD_06_01_JAGAN_CASE_IAS_FIR_3182400_TS10002 REPORTER: Nagarjuna note:బైట్ మోజో కిట్ నుంచి ఈ ఫైల్ నేమ్ తో వచ్చింది File Visuals వాడుకోగలరు. ( ) జగన్ అక్రమాస్తుల కేసులో న్యాయ సలహాల ఖర్చుల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి సీవీఎస్ కే శర్మపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. తప్పుడు రశీదులు సృష్టించి బిల్లులు కాజేశారని..ఈ వ్యవహారంలో సహకరించారని.. అప్పటి సీఎస్ పీకే మహంతి, ఏపీ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేష్ పై కూడా కేసు నమోదు చేశారు. జేడీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ రమణ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదులో నాంపల్లి కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జగన్ కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టులో దాఖలైన ఓ వ్యాజ్యంలో... న్యాయ సలహాల నిధులు ఇవ్వాలని 2014లో కొందరు ఐఏఎస్ అధికారులు కోరడంతో.. అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. అయితే సీవీఎస్ కే శర్మ న్యాయవాదికి ఫీజు చెల్లించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వం నుంచి 7 లక్షల 56 వేల రూపాయలు కాజేశారని ఆరోపిస్తూ ఏవీ రమణ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో బిల్లలు మంజూరు చేయడంలో పీకే మహంతి, పీవీ రమేష్ ప్రమేయం కూడా ఉందని పిటిషన్ లో ఆరోపించారు. పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు... సీవీఎస్ కే శర్మ, పీకే మహంతి, పీవీ రమేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సైఫాబాద్ పోలీసులను ఈనెల 28న ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ముగ్గురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బైట్: ఏ వి రమణ, పిటీషినర్
Last Updated : Nov 1, 2019, 8:55 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.