ETV Bharat / state

ఒక్క నెలలోనే రూ.1,650 కోట్ల మద్యం తాగేశారు - liquor sale in telangana

రాష్ట్రంలో మంచి నీటికి సమస్య ఉంటుంది కానీ మందు సమస్య ఉండదనిపిస్తుంది మద్యం అమ్మకాలు చూస్తుంటే. తెలంగాణలో మద్యాన్ని మంచినీళ్లలో తాగేస్తున్నారు మందుబాబులు. ఒక్క ఆక్టోబరు నెలలోనే ఏకంగా రూ.1,650 కోట్ల విలువైన మద్యాన్ని  తాగేశారు.

ఒక్క నెలలోనే రూ.1,650 కోట్ల మద్యం తాగేశారు
author img

By

Published : Oct 31, 2019, 11:23 PM IST

ఒక్క నెలలోనే రూ.1,650 కోట్ల మద్యం తాగేశారు

తెలంగాణలో మందుబాబులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. గొడవ చేయడంలో కాదు మందు తాగడంలో... అవును మీరు విన్నది నిజమే.. తెలంగాణలో ఒక్క అక్టోబరు నెలలోనే రూ.1,650 కోట్ల విలువైన మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. 26.74లక్షల కేసుల లిక్కర్‌, 38.29లక్షల కేసుల బీరు అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. రోజుకు సగటున రూ.53 కోట్లు విలువైన మద్యం రాష్ట్రంలో అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. సెప్టెంబరు నెలాఖరు నాటికే ఎక్సైజ్‌ లైసెన్స్​ల గడువు ముగిసినప్పటికీ... కొత్త విధానం అమలుకు కొంత సమయం పట్టడం వల్ల.. నెల రోజులుపాటు పాత లైసెన్స్​లనే పొడిగించారు.

రంగారెడ్డిలో అత్యధికం

ఆ నెల రోజుల్లో... అత్యధికంగా మద్యాన్ని తాగినట్లు ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాల వారీగా తీసుకుంటే రంగారెడ్డి అత్యధికంగా రూ.217 కోట్లు, హైదరాబాద్‌ రూ.206 కోట్లు, మేడ్చల్‌ మల్కాజిగిరి రూ.187 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 80 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాలల్లో రూ.20 కోట్లకు తక్కువ కాకుండా 70 కోట్ల వరకూ మద్యం అమ్మకాలు జరిగాయని వివరించారు.

ఇవీ చూడండి: ఆమెను చంపితేనే "సుఖం"..!

TG_HYD_76_31_HIGH_LIQUOR_SALES_AV_3038066 Reporter: Tirupal Reddy Dry ()తెలంగాణ రాష్ట్రంలో అక్టోబరు నెలలో ఏకంగా రూ.1,650 కోట్లు విలువైన మద్యాన్ని మందుబాబులు మంచి నీళ్ల ప్రాయంలా తాగేశారు. 26.74లక్షల కేసులు లిక్కర్‌, 38.29లక్షల కేసులు బీరు అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. రోజుకు సగటున రూ.53 కోట్లు విలువైన మద్యం రాష్ట్రంలో అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. సప్టెంబరు నెలాఖరు నాటికే ఎక్సైజ్‌ లైసెన్సీల గడువు ముగిసినప్పటికీ...కొత్త విధానం అమలుకు కొంత సమయం పట్టడంతో...నెల రోజులు పాత లైసెన్సీలకే పొడిగించారు. ఆ నెల రోజుల్లో...మందుబాబులు అత్యధికంగా మద్యాన్ని తాగినట్లు ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాల వారీగా తీసుకుంటే రంగారెడ్డి అత్యధికంగా రూ.217 కోట్లు, హైదరాబాద్‌ రూ.206 కోట్లు, మేడ్చల్‌ మల్కాజిగిరి రూ.187 కోట్లు లెక్కన మద్యం విక్రయాలు జరిగాయి. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 80 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు పేర్కొన్న ఎక్సైజ్‌ అధికారులు మిగిలిన జిల్లాలల్లో రూ.20 కోట్లుకు తక్కువ కాకుండా 70 కోట్లు వరకు మద్యం అమ్మకాలు జరిగాయని తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.