ETV Bharat / state

'లోగో ఉన్న క్యారీ బ్యాగులను ఉచితంగానే ఇవ్వాలి' - Telangana news

కంపెనీలోగో ముద్రించిన క్యారీ బ్యాగులను వినియోగదారులకు ఉచితంగానే ఇవ్వాలని మోర్ మెగా స్టోర్​ను హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. కంపెనీ లోగో ఉన్న క్యారీ బ్యాగును అమ్మి వినియోగదారుడిని తమ ప్రచారం కోసం వాడుకున్నందుకు మరో రూ.15వేలు చెల్లించాలని తీర్పు వెల్లడించింది.

'లోగో ఉన్న క్యారీ బ్యాగులను ఉచితంగానే ఇవ్వాలి'

author img

By

Published : Feb 21, 2021, 10:53 AM IST

కంపెనీలోగో ముద్రించిన క్యారీ బ్యాగులను వినియోగదారులకు ఉచితంగానే ఇవ్వాలని మోర్ మెగా స్టోర్​ను హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. లోగో లేని క్యారీ బ్యాగ్​లకు డబ్బులు తీసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది కానీ.. వినియోగదారుడి ముందుగా చెప్పి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. లోగోలేని క్యారీ బ్యాగుల ధర వివరాలను దుకాణంలో పలు చోట్ల ప్రదర్శించాలని తెలిపింది.

ఓయూ విద్యార్థి ఆకాశ్​కుమార్​కు లోగో ఉన్న క్యారీ బ్యాగును మూడు రూపాయలకు అమ్మడాన్ని వినియోగదారుల కమిషన్ తప్పుపట్టింది. ఆకాశ్​ చెల్లించిన మూడు రూపాయలను 12 శాతం వార్షిక వడ్డీతో తిరిగి ఇవ్వడంతో పాటు పిటిషన్ ఖర్చుల కింద రూ.1500 చెల్లించాలని సోమాజిగూడలోని మోర్ మెగా స్టోర్​ను ఆదేశించింది. కంపెనీ లోగో ఉన్న క్యారీ బ్యాగును అమ్మి వినియోగదారుడిని తమ ప్రచారం కోసం వాడుకున్నందుకు మరో రూ.15వేలు చెల్లించాలని తీర్పు వెల్లడించింది.

ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసు చుట్టూ బంగాల్‌ రాజకీయాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.