కేవలం డిగ్రీ కోసమే ఇంజినీరింగ్ విద్య కాకుండా..భవిష్యత్లో ఉన్న అవకాశాలను బట్టి కోర్సులు తీసుకొని ప్రావీణ్యం సంపాదించాలని తెలంగాణ సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా విద్యార్థుల కోసం నిర్వహిస్తోన్న అవగాహన కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్ధులకు ఇది చాలా ఉపయోగపడుతుందని...ప్రతిఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇప్పటికే నాణ్యమైన విద్య అందిస్తోన్న ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రెండు పీజీడీఎం కోర్సులను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ మిట్టల్తో పాటు యాజమాన్య టెక్నికల్ ఇంఛార్జీ నాగభూషణరావు, డైరెక్టర్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.