ETV Bharat / state

Car Rental Scam Hyderabad : బీ కేర్​ఫుల్ బ్రదర్.. అద్దెకు తీసుకుంటారు.. అదునుచూసి అమ్మేస్తారు.! - కార్ల దందా

Car Travel Company Fraud in Hyderabad : టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు విలాసవంతమైన జీవితాలకు అలవాడు పడుతున్నారు. ఈ క్రమంలో ఏ విధంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో కొందరు కేటుగాళ్లు నయా దందాలకు తెరలేపుతున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఓ ముఠా నకిలీ ట్రావెల్స్ కంపెనీ పేరుతో వ్యక్తిగత కార్లను అద్దెకు తీసుకుని.. వాటిని వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి అందినంత సొమ్ము దోచుకోవడం మొదలుపెట్టారు. చివరకు వారు చేసిన మోసాలు బయటపడటంతో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.

Car
Car
author img

By

Published : Jul 14, 2023, 12:39 PM IST

Fake Car Rental Agency Hyderabad : కాలం మారుతున్న కొద్దీ జరిగే మోసాలు కూడా టెక్నాలజీకి అనుగుణంగానే మారిపోయాయి. ఇప్పటికే రకరకాల దందాతో నగరంలో మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు... తాజాగా భాగ్యనగరంలో మరో కొత్త మోసానికి తెరలేపారు. సులువుగా సాధించాలనే ఆశతో తాము పనిచేస్తున్న రంగంలోనే ఈ నయా దందాను షురూ చేశారు. గత రెండేళ్ల నుంచి నగరంలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమ కార్ల దందా నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకోవడంతో ఈ కొత్త దందా వెలుగులోకి వచ్చింది.

Car Travel Company Fraud in Hyderabad : నకిలీ ట్రావెల్స్‌ కంపెనీ పేరుతో వ్యక్తిగత కార్లను అద్దెకు తీసుకొని.. వాటిని వడ్డీ వ్యాపారుల వద్ద తనఖా పెట్టి అందినంత సొమ్ము తీసుకొని ఉడాయిస్తారు. నగరంలో గత రెండేళ్ల నుంచి అక్రమ కార్ల దందా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను బాలానగర్‌ ఎస్వోటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. షాపూర్‌నగర్‌లోని బాలానగర్‌ డీసీపీ కార్యాలయంలో గురువారం ఎస్వోటీ అదనపు డీసీపీ శోభన్‌, బాలానగర్‌ ఏసీపీ గంగారం, ఎన్వోటీ ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌దేవ్‌లతో కలిసి డీసీపీ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం కైసర్‌నగర్‌కి చెందిన మహమ్మద్‌ ఉమార్‌ సనత్‌నగర్‌లో ట్రావెల్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. బల్కంపేట బీకేగూడకి చెందిన నర్సగోని ప్రవీణ్‌కుమార్‌ గౌడ్‌, అదే ప్రాంతానికి చెందిన ట్రావెల్స్‌ వ్యాపారి ఆహ్మద్‌ అలీలతో అతనికి పరిచయం ఉంది. ముగ్గురూ నగరంలో డిమాండ్‌ ఉన్న సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల పేరుతో మోసానికి తెరలేపారు. అనుకున్న వెంటనే ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. కారు కండిషన్‌, మోడల్‌ ఆధారంగా ప్రతి నెలా రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు అద్దె చెల్లిస్తామని వ్యక్తిగత వాహనాల యజమానులతో ఒప్పందం చేసుకునేవారు. ఈ విధంగా 16 కార్లను అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులు నమ్మకం కుదిరేవరకు కార్లు అద్దెకు తీసుకున్న వారికి కిరాయి చెల్లించేవారు.

Fake Car Travels Gang Arrest in Hyderabad : అలా మూడు నెలల పాటు సక్రమంగా అద్దె చెల్లించారు. ఆ సమయంలోనే వాహనాలను వడ్డీ వ్యాపారుల వద్ద తనఖాగా ఉంచి, రూ.3-7లక్షల వరకు రుణం తీసుకున్నారు. నెలల గడుస్తున్నా కార్ల యజమానులకు అద్దెలు చెల్లించడం లేదు. దీంతో వారికి అనుమానం కలిగి కార్యాలయానికి వెళ్లినా, ఫోన్లు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఓ కారు యజమాని ఎస్వోటీ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో నిందితులపై నిఘా పెట్టి బుధవారం అదుపులోకి తీసుకొని సనత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. వీరిలో ఉమార్‌, ప్రవీణ్‌కుమార్‌గౌడ్‌లను రిమాండ్‌కి తరలించగా, అలీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌దేవ్‌ని డీసీపీ అభినందించారు. సమావేశంలో సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.