హైదరాబాద్ హెచ్సీయూ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో కారు దగ్ధమైంది. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కారును రోడ్డుపై నిలిపేశాడు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కారును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఇవీ చూడండి :కస్తూర్బా పాఠశాలలో జిల్లా విద్యాధికారి విచారణ