ETV Bharat / state

ఇఫ్లూలో కారు డ్రైవర్​ అనుమానాస్పద మృతి! - crime news at hyderabad

తార్నాకలోని ఇఫ్లూలో కారు డ్రైవర్​గా పనిచేస్తున్న శ్రీనివాస్​ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే మృతుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండడం వల్ల కరెంట్ షాక్​తో మృతి చెంది ఉంటాడా? ఆత్మహత్యనా? లేదా గుండెపోటుతో సహజ మరణం చెందాడా? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

car-driver-died-at-iflu-university-hyderabad
ఇఫ్లూ యూనివర్సిటీలో కారు డ్రైవర్​ మృతి..
author img

By

Published : Mar 20, 2020, 11:18 AM IST

హైదరాబాద్​ తార్నాకలోని ఇఫ్లూలో కారు డ్రైవర్​గా పనిచేస్తున్న శ్రీనివాస్​ అనే వ్యక్తి మృతి చెందాడు. నాచారానికి చెందిన శ్రీనివాస్​కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇఫ్లూ క్యాంపస్​లో కాంట్రాక్ట్​ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు.

బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో డ్యూటీకి వచ్చి క్యాంపస్​లోని డ్రైవర్స్ రెస్ట్ రూమ్​లో ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత రూమ్​ను క్లీన్ చేయడానికి వచ్చిన మహిళ స్వీపర్​కు అచేతనంగా పడి ఉన్న శ్రీనివాస్ కనిపించాడు. పిలిచినా పలకకపోవడం వల్ల క్యాంపస్​లోని హెల్త్ సెంటర్ డాక్టర్ వచ్చి పరీక్షించి పల్స్ పడిపోయాయని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే చనిపోయాడని గాంధీ డాక్టర్​లు ధ్రువీకరించారు. అయితే రూమ్​లో మృతుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండడం వల్ల కరెంట్ షాక్​తో మృతి చెంది ఉంటాడా? ఆత్మహత్యనా? లేదా గుండెపోటుతో సహజ మరణం చెందాడా? అనే కోణాల్లో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.