హైదరాబాద్‌లో ఓ కారులో మంటలు చెలరేగాయి. తెలుగుతల్లి పైవంతెన వద్ద కారులో మంటలు వ్యాపించాయి. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి సురేశ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి గగన్‌పహాడ్ వైపు వెళుతుండగా మూల మలుపు దాటుతుండగా కారు ఆగిపోయింది.
ట్రాఫిక్ సిబ్బంది, యువకులు కారును తోస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే కారులో ఉన్నవాళ్లు కిందకు దిగి భయంతో పరుగులు తీశారు. పొగ, మంటలు గుర్తించిన పోలీసులు, యువకులు మట్టితో పాటు నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యాపారి కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడగా అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చూడండి: 21 కిలోమీటర్లు.. 30 నిమిషాలు..