బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదు. విద్యుత్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. టీఎస్ 06 ఈఆర్ 9999 కారుపై ట్రాఫిక్ చలానాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనంలో సంపన్న వర్గానికి చెందిన వ్యాపార వేత్తల కుమారులు ఉన్నట్టు సమాచారం.
ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్ ఎక్కడిది?