Cancer Screening: రాష్ట్రంలో 40 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డా.జయలత తెలిపారు. ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించిన మొబైల్ స్క్రీనింగ్ వాహనాన్ని గ్రామీణ ప్రాంతాల్లో టెస్టులు చేసేందుకు... నాంపల్లిలోని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ప్రారంభించారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఈ మొబైల్ స్క్రీనింగ్ వాహనం ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.
ఈ మొబైల్ స్క్రీనింగ్ బస్‌లో ఆధునిక సీటీస్కాన్ మిషన్, ఓపీజీ మిషన్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మహిళల్లో ఎక్కువ వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. కోటి రూపాయలు విలువ చేసే ఈ మొబైల్ స్క్రీనింగ్ బస్సును రోటరి క్లబ్ సికింద్రాబాద్ వాళ్లు స్పాన్సర్ చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్‌గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం 13 శాతం కేసులు బ్రెస్ట్ క్యాన్సర్‌వే ఉంటున్నాయి. మొదట్లోనే ఈ క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల ట్రీట్మెంట్ చేసి ప్రాణాలు కాపాడుకోవచ్చు. క్యాన్సర్‌పై అవగాహన, మొదట్లోనే గుర్తించడం వల్ల క్యాన్సర్‌ను పూర్తిగా జయించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ కోసం మొబైల్ స్క్రీనింగ్ బస్సును ప్రారంభించాం.
-- డా.జయలత ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్
క్యాన్సర్ మొదట్లోనే గుర్తిస్తే మరణాలను నియంత్రించాలనే ఉద్దేశంతో... ఈ బస్సును ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌కు ఈ స్క్రీనింగ్ బస్సును డొనేట్ చేసినట్లు రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె.ప్రభాకర్ తెలిపారు.
క్యాన్సర్‌ను స్టేజ్-1, స్టేజ్-2లోనే గుర్తిస్తే చాలా వరకు రికవరీ చేయొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వీటిపై అవగాగన లేకపోవడం వల్ల వారు స్టేజ్-3, స్జేజ్-4 వరకు ఆపుతున్నారు. అందువల్ల ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. ఆ మరణాలను ఆపాలన్న ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కోటి రూపాయలు వెచ్చించి మొబైల్ స్ర్కీనింగ్ వాహనాన్ని ప్రారంభించాం.
-- కె.ప్రభాకర్, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్
ఇదీ చదవండి: రామకృష్ణాపురం కేరాఫ్ కూరగాయలు: టైమ్‌పాస్ కోసం చేస్తే ఆరోగ్యం.. ఆదాయం..