పశ్చిమ బంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను తొలగించడం వల్ల రద్దైన రైళ్ల సేవలను పునరుద్ధరించనున్నట్లు ఏపీ వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. రద్దు చేసిన ప్రత్యేక రైళ్లను నేటి నుంచి యథావిధిగా నడపనున్నట్లు వివరించారు.
మరికొన్ని రైళ్లు 12 నుంచి..
హావ్‌డా-యశ్వంత్‌పూర్ దురంతో (02245) ప్రత్యేక రైలు, సికింద్రాబాద్-హావ్‌డా-సికింద్రాబాద్(02704-02703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు షెడ్యూల్ ప్రకారం రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. అలాగే కొన్ని రైళ్లను ఈ నెల 12నుంచి నడిపేందుకు రైల్వే వర్గాలు తెలిపాయి.
- 12 నుంచి విశాఖ-కోర్బా రోజువారీ స్పెషల్ (08518/08517)
- 13నుంచి గువాహటి-బెంగళూరు కంటోన్మెంట్ వీక్లీ స్పెషల్ (02509/02510)
- ఖుర్దారోడ్-ఓఖా స్పెషల్ (08401/08402)
- 15నుంచి తిరుచిరాపల్లి-హావ్‌డా బైవీక్లీ స్పెషల్ (02664/02663)నడపనున్నారు.
ఇవీ చూడండి : కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి : కేసీఆర్