ETV Bharat / state

engineering: ఇంజినీరింగ్‌లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌కు స్వస్తి - మారుతున్న ఇంజినీరింగ్‌ విద్య

ఇంజినీరింగ్‌(engineering) విద్య పోకడలు మారుతున్నాయి. పాత కోర్సులకు స్వస్తి చెబుతూ.. కొత్త కోర్సుల కోసం కాలేజీలు జేఎన్‌టీయూ(JNTU)కు దరఖాస్తు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 18 కళాశాలలు పలు కోర్సుల కోసం అప్లై చేసుకున్నాయి. మరికొన్ని కళాశాలల్లో సివిల్‌(civil), మెకానికల్‌(mechanical), ఎలక్ట్రికల్‌(electrical) విబాగాల్లో 50 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని.. ఈ నేపథ్యంలో ఆ కోర్సులను రద్దు చేయాలని కోరుతున్నాయి.

Cancel of some Engineering courses
ఇంజినీరింగ్‌లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌కు స్వస్తి
author img

By

Published : Jun 23, 2021, 8:30 AM IST

హైదరాబాద్‌ శివారులోని ఘట్‌కేసర్‌ సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌(engineering) కళాశాల. కొత్త కోర్సుల మోజులో మెకానికల్‌mechanical), సివిల్‌(civil), ఈఈఈ(EEE) బ్రాంచీలను తొలగిస్తామని జేఎన్‌టీయూ(JNTU)కు దరఖాస్తు చేసుకుంది. ఆ బ్రాంచీలో ఎక్కువ మంది విద్యార్థులు లేకపోవడంతో వదులుకుంటున్నట్లు తెలిపింది. కొత్త కోర్సులు తీసుకుంటామని ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకుని, జేఎన్‌టీయూకు ఎన్‌వోసీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ పెట్టుకుంది.

కొత్త కోర్సుల కోసం

నగర శివారులోని మరో ఇంజినీరింగ్‌(engineering) కళాశాల గతేడాది ఐవోటీ బ్రాంచీ తీసుకుంది. 50 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని చెబుతూ బ్రాంచీ తొలగిస్తున్నట్లు దరఖాస్తు చేసుకుంది. కేవలం ఒకే విద్యా సంవత్సరానికి బ్రాంచీ నడిపింది. దానికి బదులుగా జేఎన్‌టీయూ(JNTU) తీసుకువచ్చిన కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చేందుకు నిరభ్యంతరపత్రం కోసం దరఖాస్తు చేసుకుంది.

సంప్రదాయ కోర్సులకు స్వస్తి

కొత్త కోర్సుల మోజులో ఇంజినీరింగ్‌ కళాశాలలు సంప్రదాయ బ్రాంచీలకు స్వస్తి పలుకుతున్నాయి. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ వంటి కోర్సులు మూసివేస్తున్నాయి. ఒకప్పుడు డిమాండ్‌ ఉందని ఇబ్బడి ముబ్బడిగా ఆయా విభాగాల్లో సీట్లు తీసుకున్నాయి. ప్రస్తుతం ఆయా కోర్సుల్లో సీట్లు పూర్తిగా భర్తీ కాకపోవడం.. కంప్యూటర్‌ సైన్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉండటంతో వాటిని మూసివేస్తున్నాయి.

సీట్లు ఎక్కువగా ఉంటే

జేఎన్‌టీయూ(JNTU) పరిధిలో 234 అనుబంధ, గుర్తింపు పొందిన ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. వీటిల్లో ప్రధానంగా కాస్త పేరున్న కళాశాలలు ఎక్కువగా సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ కోర్సులు వదులుకుని ఐటీ, సీఎస్‌ఈ, ఈసీఈ కోర్సులు ప్రవేశపెడుతున్నాయి. ఒకప్పుడు మెకానికల్‌, సివిల్‌ వంటి కోర్సులకు డిమాండ్‌ ఉండటంతో నిర్దేశిత 60 సీట్ల కంటే ఎక్కువగా 120 నుంచి 180 సీట్ల వరకు కళాశాలలు తీసుకున్నాయి. ఇప్పుడు వాటిని వదిలించుకుంటున్నాయి.

డిప్లొమా విద్యార్థులకు నష్టం

ఈ పరిణామం డిప్లొమా చదివి బీటెక్‌ రెండో ఏడాదిలోకి ప్రవేశించే విద్యార్థులకు నష్టం కలిగించనుంది. కళాశాలలు సీట్లు తగ్గించుకోవడం కారణంగా లాటరల్‌ ఎంట్రీ ద్వారా రెండో ఏడాదిలోకి ప్రవేశించే విద్యార్థులు సీట్లు దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ విధానంలో ప్రముఖ కళాశాలల్లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో విద్యార్థులకు సీట్లు లభిస్తున్నాయి. కళాశాలలు తీసుకుంటున్న నిర్ణయంతో డిప్లొమా విద్యార్థులు ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి ఇబ్బందికరంగా మారనుంది.

గతంలోనూ ఇంతే..

2021-22 సంవత్సరానికి బీటెక్‌లో నాలుగు, ఎంటెక్‌లో ఏడు కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జేఎన్‌టీయూ ప్రకటించింది. బీటెక్‌లో ప్రధానంగా సీఎస్‌ఈ, మెకానికల్‌ విభాగాల్లోనే కొత్త కోర్సులున్నాయి. సీఎస్‌ఈలో కృత్రిమ మేధ-డెటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజైన్‌తోపాటు మెకానికల్‌లో ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ వంటి కోర్సులు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మార్చిలోనే నోటిఫికేషన్‌ ఇచ్చింది. 18 కళాశాలలు కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. గతేడాది సైతం కృత్రిమ మేధ, ఐవోటీ, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి కోర్సులు తీసుకువచ్చింది. దీనికి అప్పట్లో కళాశాలలు పోటీ పడి మరీ దక్కించుకున్నాయి. కానీ అనూహ్యంగా ఆయా కోర్సుల్లో చాలావరకు బ్రాంచీల్లో సీట్లు భర్తీ కాలేదు. తాజాగా సంప్రదాయ కోర్సులు వదులుకుని కొత్త కోర్సుల కోసం కళాశాలలు పాకులాడుతున్న పరిస్థితి.

చొరవ అవసరం

కొత్త కోర్సుల విషయంలో జేఎన్‌టీయూ(JNTU) తీసుకువచ్చిన విధానం ఆహ్వానించదగినది. ఇదే విషయంలో ఏఐసీటీఈ(AICTE) నుంచి ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఉండాలి. కొత్త కోర్సులు ఎంచుకోవాలంటే.. సంప్రదాయ కోర్సులను వదులుకోకుండా కళాశాలలను కట్టడి చేయాలి. లేకపోతే భవిష్యత్తులో సివిల్‌, మెకానికల్‌ వంటి కోర్సులు కనిపించకుండాపోతాయి.

- వి.బాలకృష్ణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక, ప్రొఫెషనల్‌ విద్యాసంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చూడండి: నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్​ రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.