ETV Bharat / state

CAG report on Telangana state taxes : రాష్ట్ర ఖజానాకు కాసుల పంట.. కాగ్ నివేదిక విడుదల - తెలంగాణ తాాజా వార్తలు

CAG report on Telangana state taxes : తెలంగాణలో 2022-23 ఆర్థిక ఏడాదిలో పన్నుల రాబడులు భారీగా రాగా.. పన్నేతర ఆదాయం తగ్గింది. 2021-22 ఆర్థిక ఏడాది కంటే 16,625.18 కోట్లు గత ఆర్థిక సంవత్సరం అధికంగా పన్నుల ఆదాయం అధికంగా వచ్చింది. జీఎస్టీ దాదాపు వందశాతం వసూలుకాగా, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకం మాత్రం వందశాతం దాటినట్లు కాగ్‌ వెల్లడించింది.

taxes
taxes
author img

By

Published : May 22, 2023, 7:11 AM IST

రాష్ట్ర ఖజానాకు కాసుల పంట.. కాగ్ నివేదిక విడుదల

CAG report on Telangana state taxes : తెలంగాణ రాష్ట్ర ఖజానాకు సొంత ఆదాయ వనరులు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా రెండో ఆర్థిక ఏడాది కూడా పన్నుల రాబడులు వంద శాతం దాటాయి. 2021-22 ఆర్థిక ఏడాదిలో 102.89శాతం పన్నులు వసూలుకాగా గత ఆర్థిక సంవత్సరంలో 100.01శాతం పన్నులు వసూలైనట్లు కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌-కాగ్‌ వెల్లడించింది.

గత ఆర్థిక ఏడాది పన్నేతర ఆదాయం నిర్దేశించిన లక్ష్యంలో 76.92 శాతం రాగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2021-22లో 28.99శాతం మాత్రమే వచ్చింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో రూ.1,26,606.04 కోట్లు పన్నులు వసూలు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వ అంచనా వేయగా...అయితే మార్చి నాటికి వచ్చిన పన్నుల రాబడులను పరిశీలించిన కాగ్‌ రూ.1,26,617.09 కోట్లు మేర పన్నులు వసూలతో స్వల్పంగా పెరుగుదల నమోదు చేసి 100.01 శాతం వచ్చినట్లు వెల్లడించింది.

ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.42,189.47కోట్లు జీఎస్టీ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా.. రూ.41,888.84 కోట్లు వసూలై అనుకున్న లక్ష్యంలో 99.29శాతం సాధించింది. అదేవిధంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రూ.15,600 కోట్లు మేర రాబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా రూ.14,228.19 కోట్లు వచ్చి లక్ష్యంలో 91.21శాతం మేర సాధించినట్లు పేర్కొంది.

పెరిగిన ఎక్సైజ్ ఆదాయం.. : అమ్మకపు పన్ను ద్వారా రూ.33,000 కోట్లు రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా...29,604.21 కోట్లు సాధించి లక్ష్య నిర్దేశనలో 89.71 శాతానికే పరిమితమైంది. మద్యంపై విధించిన రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకం ద్వారా మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో రూ.17,500 కోట్లు ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా అంతకు మించి రూ.18,470 కోట్లు రాబడి వచ్చి నిర్దేశించిన లక్ష్యం కంటే 5.55శాతం అధికంగా వచ్చింది.

తగ్గిన పన్నేతర ఆదాయం.. : కేంద్ర పన్నుల వాటా కింద రాష్ట్రానికి 12,407.64 కోట్లు మేర వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా రూ.13,994.87 కోట్లు వచ్చి.. 12.79 శాతం అధికంగా వచ్చినట్లు కాగ్‌ వెల్లడించింది. ఇక పన్నేతర ఆదాయం తీసుకుంటే రూ.25,421.63 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా రూ.19,553.62 కోట్లు మాత్రమే వచ్చి 76.92శాతానికే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల కింద రూ.41,001.73 కోట్లు వస్తుందని అంచనా వేయగా.. కేవలం రూ.13,179.21 కోట్లు అంటే కేవలం 32.14శాతం వచ్చినట్లు కాగ్‌ వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.