ETV Bharat / state

cabinet subcommittee on corona: 'నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్​ కోసం ప్రత్యేక కార్యాచరణ'

author img

By

Published : Dec 2, 2021, 3:31 AM IST

నెలాఖరులోగా వందశాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్లను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు మార్గనిర్ధేశం చేసింది. టీకాల విషయంలో వెనుకంజ వేస్తున్న వారిని మరింత చైతన్యవంతం చేయాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో గతంలో నెలకొల్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్​ను తిరిగి క్రియాశీలం చేయాలన్న మంత్రులు... ఒమిక్రాన్ వేరియంట్​కు అడ్డుకట్ట వేయాలంటే టీకాతో పాటు ప్రజలందరూ మాస్కులు, కొవిడ్ నిబంధనలు పాటించడం ఏకైక మార్గమని అన్నారు.

cabinet subcommittee on corona: 'నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్​ కోసం ప్రత్యేక కార్యాచరణ'
cabinet subcommittee on corona: 'నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్​ కోసం ప్రత్యేక కార్యాచరణ'

కొవిడ్ వ్యాక్సినేషన్​తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో చర్చించింది. మంత్రి హరీశ్​ రావు అధ్యక్షతన బీఆర్కే భవన్ నుంచి నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నెలాఖర్లోపు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్లను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. పంచాయతీరాజ్, పురపాలక, విద్య, ఆరోగ్య సహా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవాలని మార్గనిర్ధేశం చేసింది.

టీకాలతో పాటు మాస్క్​లు తప్పనిసరి

ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో టీకాలతో పాటు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, కొవిడ్ నిబంధనలను పాటించడమే ఏకైక మార్గమని మంత్రులు తెలిపారు. టీకాల ప్రక్రియలో దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉందన్న మంత్రులు... వందశాతం లక్ష్యసాధన కోసం ఆవాసాలు , వార్డులు, సబ్ సెంటర్లు, పురపాలికలు, మండలాల వారీగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు. టీకాల విషయంలో వెనుకంజ వేస్తున్న వారిని మరింతగా చైతన్యవంతుల్ని చేయాలని చెప్పారు.

యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..

వైద్య, ఆరోగ్య శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏరియా ఆసుపత్రుల అప్ గ్రేడేషన్, రేడియాలజీ ల్యాబ్​లు , పాథాలజీ ల్యాబ్ , ఆర్టీపీసీఆర్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన వసతులు, స్థలాలు కేటాయింపు, కొత్త వైద్యకళాశాలల భవనాల నిర్మాణం, అనుబంధ ఆసుపత్రుల్లో అదనపు పడకల ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులతో వెంటనే చర్చించాలని మంత్రి సూచించారు.

కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ను క్రియాశీలకం చేయాలి..

రెండు విడతల కొవిడ్​పై ఏర్పాటైన పరిస్థితులపై అందరికీ అవగాహన ఉందన్న మంత్రి కేటీఆర్... సామాజిక మాధ్యమాల్లో జరిగే తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసి చైతన్యవంతుల్ని చేయాలని అన్నారు. కరోనాపై వచ్చే పుకార్లతో ప్రజల్లో గందరగోళం నెలకొంటుందన్న ఆయన... ప్రజలకు సరైన సమాచారాన్ని, సూచనలను ఎప్పటికప్పుడు అందించడమే ఇందుకు పరిష్కారమని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రజలు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేటీఆర్... కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఆసుపత్రుల పడకలపై ప్రజలకు సమాచారాన్ని అందించాలని తెలిపారు. ప్రజలకు సరైన సమాచారం, సూచనలు అందించేందుకు రాష్ట్ర స్థాయిలో గతంలో నెలకొల్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్​ను తిరిగి క్రియాశీలం చేయాలని... 24 గంటల పాటు పనిచేయించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి...

పాఠశాలలు, కళాశాలలు , వసతిగృహాల్లో కొవిడ్ నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిలో 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తైనట్లు చెప్పారు. అవసరమైన చోట విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి వందశాతం లక్ష్యం సాధించాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి:

అక్టోబర్​లోనే 'ఒమిక్రాన్​' వ్యాప్తి- ఆ దేశాల్లో తొలి కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.