సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కళకళాడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం 6 గంటల నుంచే బస్సులు నడుస్తాయన్న ప్రకటన మేరకు ప్రయాణికులంతా బస్టాండ్‌కు క్యూ కట్టారు. అలాగే అల్వాల్, బొల్లారం బస్‌స్టాప్‌ల వద్దకు ప్రయాణికులు జిల్లాలకు వెళ్లేందుకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. కానీ జేబీఎస్ నుంచి బస్సులు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జంటనగరాల్లో ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు అనుమతి లేకపోవడం వల్ల సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
జేబీఎస్ నుంచి 2 గంటలు ఆలస్యంగా బయల్దేరిన బస్సులు - ఆర్టీసీ బస్సులు ప్రారంభం
లాక్డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు... రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి బస్సులు... రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాయి.
![జేబీఎస్ నుంచి 2 గంటలు ఆలస్యంగా బయల్దేరిన బస్సులు JBS BUS Stand latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7255910-1027-7255910-1589866038552.jpg?imwidth=3840)