ETV Bharat / state

పూర్తి స్థాయి బడ్జెట్​పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

పూర్తి స్థాయి బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్నపన్నుల వాటా, గ్రాంట్ల విషయంలో స్పష్టత రావడం వల్ల రాష్ట్ర పరిధిలో ఆదాయ, వ్యయాలపై ఆర్థిక శాఖ అంచనాలను రూపొందిస్తోంది. ఈ నెల 14వ తేదీ నాటికి బడ్జెట్‌కు చెందిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందచేసే దిశలో ఆర్థిక శాఖ వేగం పెంచింది. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

పూర్తి స్థాయి బడ్జెట్​పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
author img

By

Published : Aug 8, 2019, 5:26 AM IST

Updated : Aug 8, 2019, 12:53 PM IST

పూర్తి స్థాయి బడ్జెట్​పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

కేంద్ర ప్రభుత్వం గత నెలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు, గ్రాంట్లపై స్పష్టత రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు వీలుగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలను ఈ నెల 14వ తేదీ నాటికి 2019-20 బడ్జెట్‌ ప్రతిపాదనలతోపాటు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందచేయాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల వాటాతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పథకాలకు కింద వచ్చే గ్రాంట్లపై అంచనాలు రావడం వల్ల బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ జరుగుతోంది.

ఉపాధి హామీ పథకం నిధులింకా రాలేదు

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఆరు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటాగా 2019-20 ఆర్థిక ఏడాదికి రూ.19718 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. మొదటి మూడు నెలల్లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లను విశ్లేషించారు. జూన్‌ నెలాఖరు వరకు రాష్ట్రానికి రూ.1351 కోట్లు మాత్రమే గ్రాంట్లు రూపంలో వచ్చింది. మొదటి త్రైమాసికంలో ఉపాధి హామీ పథకం, 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏమీ రాలేదు. ఈ నిధులు త్వరలో వస్తాయని... రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రూ.8,177 కోట్లు రాగా పన్నుల వాటా కింద రూ.13614 కోట్లు వచ్చింది.

పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన రూ.1.82 లక్షల కోట్లతో 2019-20 ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది. వస్తు సేవల పన్ను ద్వారా రాష్ట్రానికి వచ్చే రాబడులపై పూర్తి స్పష్టత ఉండడం వల్ల పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. 2018-19 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ అంచనాల కంటే 4.4శాతం పెరుగుదలతో వాస్తవ వ్యయం ప్రాతిపదికన బడ్జెట్‌ రూపొందిస్తున్నారు.

ఇవీ చూడండి: తీర్పు రిజర్వ్​: కూల్చడమా.. మిగల్చడమా?

TG_Hyd_04_08_BUDGET_EXERCISES_SPEEDUP_PKG_3038066 Reporter: M.Tirupal Reddy ()పూర్తి స్థాయి బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్నపన్నుల వాటా...గ్రాంట్ల విషయంలో స్పష్టత రావడంతో రాష్ట్రం పరిధిలో ఆదాయ, వ్యయాలపై ఆర్థిక శాఖ అంచనాలను రూపొందిస్తోంది. ఈ నెల 14వ తేదీ నాటికి బడ్జెట్‌కు చెందిన ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి అందచేసే దిశలో ఆర్థిక శాఖ వేగం పెంచింది. ఆగస్టు నెలాఖరులోకాని, సప్టెంబరు మొదటి వారంలో కాని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. LOOK వాయిస్‌ఓవర్‌1: కేంద్ర ప్రభుత్వం గత నెలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు, గ్రాంట్లపై స్పష్టత వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు వీలుగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలను ఈ నెల 14వ తేదీనాటికి 2019-20 బడ్జెట్‌ ప్రతిపాదనలతోపాటు 2018-19 ఆర్థిక సంవత్సరానికి చెంది సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందచేయాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. తొందరల్లో శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల వాటాతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పథకాలకు కింద వచ్చే గ్రాంట్లపై అంచనాలు రావడంతో వాటి ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ జరుగుతోంది. వాయిస్ఓవర్2: ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఏప్రిల్‌ నుంచి సప్టెంబరు వరకు ఆరు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఈ నెలాఖరులోకాని, వచ్చే నెల మొదటి వారంలోకాని పూర్తి స్థాయి బడ్జెట్‌ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటాగా 2019-20 ఆర్థిక ఏడాదికి రూ.19718 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. మొదటి మూడు నెలలలో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లను విశ్లేషించారు. జూన్‌ నెలాఖరు వరకు రాష్ట్రానికి రూ.1351 కోట్లు మాత్రమే గ్రాంట్లు రూపంలో వచ్చింది. మొదటి త్రైమాసికంలో ఉపాధిహామీ పథకం, 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏమీ రాలేదు. ఈ నిధులు త్వరలో వస్తాయని...రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రూ.8,177 కోట్లు రాగా పన్నుల వాటా కింద రూ.13614 కోట్లు మొత్తం వచ్చింది. వాయిస్ఓవర్‌3: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన రూ.1.82లక్షల కోట్లతో 2019-20 ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది. వస్తు సేవల పన్ను ద్వారా రాష్ట్రానికి వచ్చే రాబడులపై పూర్తి స్పష్టత ఉండడంతో పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. 2018-19 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ అంచనాల కంటే 4.4శాతం పెరుగుదలతో వాస్తవ వ్యయం ప్రాతిపదికన బడ్జెట్‌ రూపొందిస్తున్నారు.
Last Updated : Aug 8, 2019, 12:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.