హైదరాబాద్ నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని అలిజాపూర్లో ఆటో డ్రైవర్ దారుణహత్యకు గురయ్యాడు. మృతుని ఒంటిపై గాయలను చూస్తే బండరాయి, పదునైన ఆయుధంతో హతమార్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు 25ఏళ్ల చాంద్గా గుర్తించారు. పాత కక్షలు, కుటుంబ కలహాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. చాంద్ సమీప బంధువు 26ఏళ్ల అబ్దుల్ రహమాన్ హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: పోలీసు శాఖలో కొలువుల జాతర..15 వేల ఉద్యోగాల భర్తీ