ETV Bharat / state

మరో పరువు హత్య.. భార్య కళ్లెదుటే కత్తులతో పొడిచి.. - Dulapally Latest News

Brutal Murder a person in Medchal: మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ కూతురు వేరే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుందనే కోపంతో యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడిని కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఆ యువతిని వారి వెంట తీసుకెళ్లారు.

Hyderabad
Hyderabad
author img

By

Published : Mar 3, 2023, 12:18 PM IST

Updated : Mar 3, 2023, 12:56 PM IST

Brutal Murder a person in Medchal: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది యువతి తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో ఆ దంపతులు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయినా అమ్మాయి తరఫు బంధువులు సదరు యువకుడిపై పగ పెంచుకున్నారు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే వారి కదలికలపై నిఘా పెట్టారు. చివరకు యువతి కళ్లెదుటే యువకుడిని దారుణంగా హత్య చేసి అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

దూలపల్లిలోని సూరారం కాలనీలో హరీశ్ కుటుంబం 6 నెలలుగా నివాసం ఉంటోంది. గతంలో ఎర్రగడ్డలో నివాసం ఉన్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇది కాస్త యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు యువకుడిని హెచ్చరించారు. దీంతో అతడు దూలపల్లికి మకాం మార్చాడు. అక్కడ ఓ అందమైన ఇంటిని నిర్మించుకుని గతంలో ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకుని హాయిగా జీవిస్తున్నారు.

ప్రేమ వ్యవహారమే కారణం..: దీంతో హరీశ్​పై పగ పెంచుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అతడిని ఎలాగైనా అంతం చేయాలని పథకం వేశారు. ఇందుకోసం వారి కదలికలపై నిఘా పెట్టి రెండు రోజుల క్రితం దూలపల్లి వద్ద దంపతులు ఉండగా.. అమ్మాయి హరీశ్​ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం అమ్మాయిని తమతో పాటు తీసుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టు​మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే హరీశ్‌ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

గతంలోనూ ఇద్దరి మధ్య గొడవ..: హరీశ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులను పేట్​బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతో సదరు యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ తన చెల్లి వెంట పడొద్దని హరీశ్‌ను​ యువతి సోదరుడు హెచ్చరించాడని తెలిపారు. ప్రేమ, పెళ్లి విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరిగాయని చెప్పారు. అయినా హరీశ్ అమ్మాయిని వివాహం చేసుకోవడంతో.. అతడిపై పగ పెంచుకున్నాడు. దీంతో మరో ఇద్దరితో కలిసి యువతి సోదరుడు హరీశ్‌ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి: అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో మరో హత్య.. ప్రేమించిన అమ్మాయిపై మనసుపడ్డాడని..

గంజాయి గ్యాంగ్ ఆగడాలు.. బట్టలు విప్పి.. బెల్టుతో కొడుతూ దాడి

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన​ BJP ఎమ్మెల్యే కొడుకు.. రూ. 6 కోట్లు స్వాధీనం

Last Updated : Mar 3, 2023, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.