ETV Bharat / state

BRS on Telangana Assembly Elections : 'మే'లో అసెంబ్లీ ఎన్నికలు..! బీఆర్ఎస్​కు లాభమా.. నష్టమా..? - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్

BRS on Telangana Assembly Elections 2023 : శాసనసభకు ఎన్నికల షెడ్యూల్‌ అక్టోబరులో విడుదల కాకపోతే.. ఎలక్షన్‌ వాయిదా పడే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ భావిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగవచ్చని అంచనా వేస్తోంది. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిశితంగా పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అధిష్ఠానం.. ఈ అంశంపై కొద్ది రోజులుగా ముఖ్య నాయకులతో చర్చిస్తోంది. ఒకవేళ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు కలిసి నిర్వహించినా.. బీఆర్ఎస్​కే లాభమని భావిస్తోంది.

Telangana Assembly Elections 2023
BRS on Telangana Assembly Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 7:06 AM IST

BRS on Telangana Assembly Elections మేలో అసెంబ్లీ ఎన్నికలు.. బీఆర్ఎస్​కు లాభమా.. నష్టమా..

BRS on Telangana Assembly Elections 2023 : కేంద్ర ప్రభుత్వ తాజా అడుగుల నేపథ్యంలో.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections 2023).. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగవచ్చని భారత్ రాష్ట్ర సమితి(BRS) అంచనా వేస్తోంది. బీఆర్ఎస్​లో చర్చించిన అంశాలను ఒక ముఖ్యనేత వెల్లడించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లు పెట్టకపోతే.. అక్టోబరు 5 నుంచి 10 తేదీ మధ్య రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావాలని ఆ ముఖ్యనేత విశ్లేషించారు.

రామ్‌నాథ్‌ కోవింద్‌(Ram Nath Kovind) నేతృత్వంలో వేసిన కమిటీకి ఆరు నెలల సమయం ఎందుకు ఇచ్చారు..? అనేది ఆలోచించాల్సిన అంశమన్నారు. అయోధ్యలో రామమందిరానికి ప్రారంభోత్సవం చేయకుండా మోదీ ఎన్నికలకు వెళ్లరన్నారు. జనవరి 22న రామమందిరం ప్రారంభించిన వెంటనే ఎన్నికలకు వెళ్లలేరని బీఆర్ఎస్​ ముఖ్యనేత అన్నారు. ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్‌(Central Budget) పెట్టాలని.. లేదంటే జీతాలివ్వలేని పరిస్థితి వస్తుందన్నారు. మార్చిలో విద్యార్థులకు పరీక్షలుంటాయని.. ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు పెట్టాల్సి వస్తుందని తెలిపారు.

BRS Strategy On Telangana Assembly Elections : రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోబోతున్నామని బీజేపీకు తెలుసని.. అందుకే ఈ రాష్ట్రాలకు విడిగా ఎన్నికలు పెట్టకుండా మే నెల వరకూ వాయిదా వేసే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని వాయిదా వేయకపోతే.. ఎన్నికల కమిషన్‌ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' విధానాన్ని అమలు చేయకపోయినా.. 'ఒకే దేశం-రెండు ఎన్నికలు' విధానాన్నైనా ఈసారి అమలు చేయొచ్చని బీఆర్ఎస్​ భావిస్తోంది. మోదీ ఒక్కరోజు కూడా అధికారాన్ని వదులుకోలేరని.. పార్లమెంటు ఎన్నికలను ముందుకు జరపకుండా.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలనే మే వరకూ వాయిదా వేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది.

KTR ChitChat With Media on Telangana Assembly Elections 2023 : అక్టోబర్‌లో కాదు.. 6 నెలల తర్వాతే తెలంగాణ ఎన్నికలు: కేటీఆర్

Telangana Assembly Elections in May 2024 : అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడినా.. తమకే లాభమని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రాజెక్టులు పూర్తై నీళ్లు పంటలకు చేరుతాయని.. మరిన్ని అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చని అనుకుంటోంది. అక్కడక్కడా అసంతృప్తులు, అసమ్మతులుంటే సర్దిచెప్పుకోవడానికి తగినంత సమయం ఉంటుందని బీఆర్ఎస్ ముఖ్యనేత అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు(Parliament Elections) కలిసి రావడం వల్ల.. మోదీ, అమిత్‌షా వంటి నేతలు ఎక్కువ దృష్టిని తెలంగాణపై కేంద్రీకరించే అవకాశాలుండవని బీఆర్ఎస్​ ముఖ్యనేత విశ్లేషించారు. భారత్ రాష్ట్ర సమితి పోటీ చేసేది కేవలం తెలంగాణ, మహారాష్ట్రలో మాత్రమేని.. ఈ రెండింటిపై దృష్టి పెడితే సరిపోతుందన్నారు.

BRS Focus on Assembly Elections 2024 : ఒకవేళ ఎన్నికలు వాయిదా పడితే.. రాష్ట్రంలో పాలనను ఆపద్ధర్మ ప్రభుత్వానికి అప్పగించకుండా.. రాష్ట్రపతి పాలన తీసుకొస్తే దానివల్ల బీజేపీకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి ఎంత చెడ్డ పేరు వచ్చిందో.. రాష్ట్రపతి పాలన పెడితే బీజేపీకు కూడా అంతకంటే ఎక్కువ చెడ్డపేరు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఎన్నికలను సమర్థంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొనే ధైర్యం లేక.. రాష్ట్రపతి పాలన పెట్టారని ఎదురుదాడి చేయడానికి ఒక ఆయుధం లభిస్తుందన్నారు. అలా బద్నామయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా అనేది వేచి చూడాలని బీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు విశ్లేషించారు.

BRS On Jamili Election 2023 : జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం.. నేతలకు కేసీఆర్ మార్గనిర్దేశం

BRS Parliamentary Party Meeting : ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.