ETV Bharat / state

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సోషల్‌ మీడియా ఖాతాలు హ్యాక్‌

BRS MLC Kavitha Social Media Accounts Hacked : తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కి గురైనట్టు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎక్స్ సహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను హ్యాక్‌ చేశారని సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. ఈ మేరకు డీసీపీ, సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ట్యాగ్ చేస్తూ కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

telangana cyber crimes
BRS MLC Kavitha Social Media Accounts Hacked
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 7:48 PM IST

BRS MLC Kavitha Social Media Accounts Hacked : రాష్ట్రంలో వరుసపెట్టి చోటుచేసుకుంటున్న రాజకీయ నేతల సోషల్‌ మీడియా ఖాతాల హ్యాకింగ్‌ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(Kavitha) చేరారు. తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కి గురైనట్టు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎక్స్ సహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను హ్యాక్‌ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు డీసీపీ, సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ట్యాగ్ చేస్తూ కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  • My social media account experienced a brief unauthorized access. The suspicious activities and contents during this time do not reflect our values. Security measures have been reinforced, and we will observe a downtime to ensure security and we appreciate your understanding as my…

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుసార్లు హ్యాకింగ్‌కు యత్నిస్తున్నట్లు గుర్తించామన్నారు. సైబర్ నేరగాళ్లు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోగి లాగిన్ అయ్యి సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేసినట్టు పేర్కొన్నారు.

Telangana Governor X Account Hack : రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Governer Tamilisai) సౌందరరాజన్ కూడా హ్యాకింగ్ బాధితురాలయ్యారు. ఆమె ఎక్స్ (ట్విటర్) అకౌంట్ హ్యాక్​కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి పాస్‌వర్డ్ మార్చినట్లు సమాచారం. కంపెనీ నియమ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎక్స్​ కంపెనీ నుంచి గవర్నర్​కు ఓ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ తన అకౌంట్​ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా, పాస్‌వర్డ్ తప్పంటూ జవాబు వచ్చినట్లు రాజ్​భవన్ అధికారులు తెలిపారు. అందులో పోస్టులను పరిశీలించిన తమిళిసై, తనకు సంబంధంలేని పోస్టులు పెట్టినట్లు గుర్తించారని వెల్లడించారు.

How To Check My Device Is Hacked Or Not : మీ ఫోన్​ హ్యాక్​​ అయ్యిందని అనుమానంగా ఉందా?.. ఒక్క నిమిషంలో కనిపెట్టేయండి!

ఈ విషయంపై రాజ్​భవన్ సిబ్బందిని ఆరా తీసినట్లు చెప్పారు. చివరకు తన అకౌంట్ హ్యాకింగ్​కు గురైనట్లు గమనించిన గవర్నర్ తమిళిసై దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గవర్నర్ ఆదేశాలతో రాజ్​భవన్​ అధికారులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. గవర్నర్ ఎక్స్​ అకౌంట్​ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాఫ్తు చేపట్టినట్లు తెలిసింది.

Minister Damodara Rajanarsimha Facebook Account Hacked : ఇటీవలే రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్​బుక్ ఖాతా కూడా హ్యాక్​కు గురైన విషయం విదితమే. మంత్రి ఖాతాను తమ కంట్రోల్​లోకి తీసుకున్న సైబర్ కేటుగాళ్లు, అందులో బీజేపీ, టీడీపీ, తమిళనాడుకు చెందిన పలు రాజకీయ పార్టీల ఫొటోలను వందల సంఖ్యలో పోస్టు చేశారు.

ఫేస్​బుక్ హ్యాక్ అవుతుందని భయమా? ఇవి పాటిస్తే మీ ఖాతా సూపర్ స్ట్రాంగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.