ETV Bharat / state

ఆదానీ గ్రూపుపై దర్యాప్తు జరిపించాలి: కవిత - debate on adani group

Investigation on Adani companies: ఆదానీ సంస్థల షేర్ల విలువలు పడిపోతున్నా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదానీ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

mlc
mlc
author img

By

Published : Feb 6, 2023, 7:55 PM IST

Investigation on Adani companies: దేశంలో సంక్షోభిత పరిస్థితులు నెలకొన్నాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. మిన్ను విరిగి మీద పడ్డట్లు ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఉలుకుపలుకు లేదని ఎద్దేవా చేశారు. ఆదానీ సంస్థల షేర్ల విలువలు పడిపోతున్నా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం దారుణమని విమర్శించారు. శాసన మండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.

ఆదానీతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థల షేర్ల విలువ గత నెల 23వ తేదీ నుంచి భారీగా పడిపోయాయని, దాంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రూ.3,600గా ఉన్న ఆదానీ షేర్ విలువ ఇప్పుడు దాదాపు రూ.1,400కు పడిపోయిందని ఆమె గుర్తు చేశారు. దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరైతే అంతా బాగేనే ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఎలా అంటారని ప్రశ్నించారు.

ఈ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆదానీ వ్యవహారంపై ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోదీ మద్ధతుతో ఆదానీ అపారమైన సంపదను కూడబెట్టిన విషయం ప్రపంచమంతా తెలుసు అని అన్నారు.

debate on hindenberg allegations on adani group: ఆదానీ వ్యవహారంపై ఎవరు ప్రశ్నించినా అంతా బాగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, రిజర్వు బ్యాంకు చెబుతున్నాయన్నారు. ఏ ప్రభుత్వం మద్దతుతో అదానీ రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారో అందరికి తెలుసు అని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని మోదీ బడ్జెట్ దేశాన్ని నిరుత్సాహపర్చితే ..కేసీఆర్ బడ్జెట్ మాత్రం దేశానికి స్పూర్తినిచ్చిందని పేర్కొన్నారు. రూ. 2.90 లక్షల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్​ను ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయమన్నారు. ఆర్థిక సంఘం నిధులను నేరుగా స్థానిక సంస్థలకు ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్​కు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ ఆరోపణలు చేసిన తర్వాత అదానీ గ్రూప్‌ వాటాలు భారీగా పతనమయ్యాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన 10 సంస్థలు దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయలను కేవలం ఆరు రోజుల్లో నష్టపోయాయి. అదానీ గ్రూప్‌ అంశంపై సెబీ చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.