BRS MLA Tickets Telangana 2023 : రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు, సామాజిక సమీకరణలను అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పరిగణనలోకి తీసుకుంది. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్(KCR).. సిట్టింగ్ శాసనసభ్యులకే మళ్లీ ప్రాధాన్యమిచ్చారు. తొమ్మిది స్థానాల్లో మినహా మిగతా శాసనసభ్యులందరూ పోటీ చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన 115 స్థానాల్లో ఓసీలకే ప్రాధాన్యం లభించింది. ఓసీలకు 58 టికెట్లు దక్కగా.. బీసీలకు 22, ఎస్సీలకు 20, ఎస్టీలకు12 టికెట్లు దక్కాయి.
అభ్యర్థుల ఖరారులో బీఆర్ఎస్(BRS Party) వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రత్యర్థి పార్టీలు సిద్ధం కాకముందే గులాబీ అభ్యర్థులను కేసీఆర్ రంగంలోకి దించారు. మిగతాపార్టీలు అభ్యర్థులను తేల్చకముందే.. రెండు విడతల ప్రచారం పూర్తిచేసేలా ప్రణాళికలు రచించారు. ఈనెల 25న మిగిలిన నాలుగు స్థానాలకు.. అభ్యర్థులను ప్రకటించనున్నారు.
BRS Candidates List Telangana 2023 : ఇంకా ప్రకటించాల్సిన నాలుగు స్థానాల్లో మూడు ఓసీలకు, ఒకటి మైనార్టీలకు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు మహిళలకు బీఆర్ఎస్ టికెట్లను ఖరారు చేసింది. కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి, గొంగిడి సునీత, లాస్య నందిత, హరిప్రియ నాయక్, పద్మా దేవేందర్ రెడ్డి, నాగజ్యోతికి టికెట్లు దక్కాయి. నర్సాపూర్ లో సునీత లక్ష్మారెడ్డికి అవకాశం ఇస్తే.. మహిళ అభ్యర్థుల సంఖ్య ఎనిమిదికి చేరనుంది.
Telangana Assembly Elections 2023 : అభ్యర్థుల జాబితాలో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలకు అసెంబ్లీ టికెట్లు దక్కాయి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి.. దుబ్బాక, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరికి.. స్టేషన్ ఘన్పూర్, పాడి కౌశిక్ రెడ్డికి.. హుజురాబాద్ టికెట్లు దక్కాయి. జనగామలో కూడా ఎమ్మెల్సీనే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త ప్రభాకర్ రెడ్డి, కౌశిక్ రెడ్డితో పాటు.. ఖానాపూర్ అభ్యర్థి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్, వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, కోరుట్ల నుంచి డాక్టర్ సంజయ్, ఉప్పల్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి లాస్య నందిత, ములుగు అభ్యర్థి నాగజ్యోతి బీఆర్ఎస్ తరఫున మొదటి సారి అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు.
CM KCR Contests from Two Seats : ఈసారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ
BRS Assembly Tickets List 2023 : ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు స్థానాల్లోనూ ఆరింటిలోనూ కొత్తవారికి అవకాశం ఇచ్చింది. ఏడు స్థానాల్లోనూ ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీనే ఉంటుందని స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అనూహ్యంగా కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీతో పాటు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ప్రభావితం చేసే ఆలోచనతో కేసీఆర్ పావులు కదిపినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.