ETV Bharat / state

'ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తాం - తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం' - రాజ్‌భవన్‌లో కేటీఆర్‌ మీటింగ్

BRS Meeting at Telangana Bhavan : ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యేలు, నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకత్వంపై సానుకూల స్పందన వస్తోందని వెల్లడించారు. పదేళ్లలో బీఆర్ఎస్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు.

BRS Meeting at Telangana Bhavan
BRS Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 2:01 PM IST

Updated : Dec 4, 2023, 4:04 PM IST

BRS Working President KTR at Raj Bhavan : పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

BRS Meeting at Telangana Bhavan : ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ నేతల చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల ఫలితంగా ప్రజలు మరో పార్టీకి అవకాశం ఇచ్చినా, బీఆర్ఎస్ గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టుకుందని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యేలు, నేతలతో చెప్పారు. బీఆర్ఎస్ నాయకత్వంపై సానుకూల స్పందన వస్తోందని వెల్లడించారు.

KTR, Telangana Elections Results 2023 Live : కాంగ్రెస్‌కు గుడ్‌ లక్ - ఓడిపోయామని బాధగా ఉన్నా

KTR on Telangana Election Results 2023 : రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోతుందని అనుకోలేదంటూ అన్ని వర్గాల నుంచి మెసేజ్​లు వసున్నాయని తమ పార్టీ నేతలు చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని వివరించారు. తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR, Telangana Election Result 2023 : ఈ ఏడాది ఆగస్టులో అభ్యర్థుల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి 100 రోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలో ఆశించిన ఫలితం రాలేదని నిరాశ చెందారు. ఎందుకంటే గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని అనుకున్నామని అన్నారు. ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషించి, దానిపై శ్రద్ధ పెడతామని తెలిపారు.

Telangana Assembly Election 2023 Result : తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యతను సరిగా నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు. అధికారం ఇస్తే ఎంత బాధ్యతగా ఉన్నామో, ఓడిన తర్వాత కూడా అంతే బాధ్యతగా ఉంటామని తెలిపారు. ఈ ఎదురుదెబ్బను పాఠంగా నేర్చుకుంటామని, అనుకున్నట్లు తెలంగాణ సాధించామని, అధికారంలో మంచి పాలన చేశామని సంతృప్తి ఉందన్నారు. 100 శాతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలుచుని ఉంటామని కేటీఆర్ అన్నారు. గెలిచిన పార్టీ ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఇప్పుడే కొత్త ప్రభుత్వాన్ని తొందర పెట్టమని, వాళ్లు కుదురుకోవడానికి కాస్త సమయం కేటాయిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

KTR, Telangana Election Result 2023 : 'అధికారంలో ఉంటే ఎంత బాధ్యతగా ఉన్నామో - ఓడిపోయినా అంతే బాధ్యతగా ఉంటాం'

ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ సీరియస్ - 100 శాతం అధికారంలోకి వస్తామని ధీమా

Last Updated : Dec 4, 2023, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.