BRS Leader Vinod Kumar on Central Govt Funds : రాష్ట్ర సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లడం సంతోషమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర నిధుల విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించడంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను తీసుకురాడంలో విఫలమైందని విమర్శించడం చాలా బాధాకరమని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై తమ ప్రభుత్వ హయాంలోనూ ప్రధానిని కలిసి వివరించామని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా పలుమార్లు ప్రధానిని కలిసి వివరించినా స్పందన లేదని తెలిపారు.
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మరోసారి కన్నేసింది : బోయినపల్లి వినోద్ కుమార్
BRS Leader Vinod Kumar comments on Bhatti Vikramarka : తెలంగాణలో సగటు జాతీయ రహదారులు కూడా లేవని వినోద్‌కుమార్ (BRS Reaction on Congress Leaders Meet Modi) అన్నారు. రాష్ట్రంలో చాలా వరకు నేషనల్ హైవేలను సాధించామని అన్నారు. కొన్ని పూర్తి అయ్యాయని మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. సైనిక స్కూల్ విషయంలో కొత్తగా వెళ్లి అడగాల్సిన అవసరం లేదని తమ ప్రభుత్వ హయాంలోనే అడిగినప్పుడు కేంద్ర నుంచి ఇస్తామని హామీ వచ్చిందని చెప్పారు. బయ్యారం హుక్కు- తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకాం స్టీల్ అథారిటీ బృందం వచ్చి ఆ ప్రదేశంలో నాణ్యమైన ఇనుప ఖనిజ సంపద లేదని చెప్పిందని, అందుకే నిలిపి వేశారని తెలిపారు.
Vinod Kumar Hot Comments On BRS Leaders : 'సొంత పార్టీ నేతల వల్లే గత ఎన్నికల్లో ఓటమి'
"రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి సీఎం తేవడం సంతోషం. కేంద్ర నిధుల విషయంలో గత ప్రభుత్వం తాత్సారం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్ర నిధులు రాబట్టడంలో విఫలమైనట్లు విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై బీఆర్ఎస్ హయాంలోనూ ప్రధానిని కలిసి వివరించాం. విభజన చట్టం హామీల విషయమై కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశాం. కేసీఆర్ కూడా పలుమార్లు ప్రధానిని కలిసి వివరించినా స్పందన లేదు."- వినోద్‌కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నేత
Vinod Kumar Explain to Central Funds in BRS Govt : కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీకీ ప్రధాని శంకుస్థాపన చేశారని వినోద్ కుమార్ తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ ఫ్యాక్టరీ(BRS Leader Vinod Kumar on Khazipet Coac Factory ) ఇచ్చారని ఆ విషయంలో గట్టిగా అడగాలని ప్రస్తుత ప్రభుత్వానికి సూచించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కావాలని తమ ప్రభుత్వం పార్లమెంట్లో అడిగామని చెప్పారు. దీనిపై మోదీ స్పందించలేదని తెలిపారు.
ఆరోజు పార్లమెంటులో మేము మాట్లాడిన వీడియోలు జీవన్‌రెడ్డికి పంపించాం : వినోద్ కుమార్
'రాష్ట్రంలో గందరగోళం, రాజకీయ అస్థిరత సృష్టించేందుకు బీజేపీ కుట్ర'