BRS First List MLA Candidates Celebrations : బీఆర్ఎస్ అభ్యర్థుల(BRS MLA Candidates List 2023) ప్రకటనతో.. రాష్ట్రవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఎమ్మెల్యే ముఠాగోపాల్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు.. బాణసంచా కాల్చి సందడి చేశారు. ఉప్పల్‌లో బండారి లక్ష్మారెడ్డి.. అనుచరులు గులాబీ రంగులు చల్లుకున్నారు. ఆయన నివాసానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో.. ప్రకాశ్‌గౌడ్‌కు అభిమానులు మిఠాయిలు తినిపించారు.
BRS Selected Candidates Celebrations : ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న సంబురాల్లో మునిగితేలారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభిమానులు బైక్‌ర్యాలీ చేపట్టారు. ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి.. నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు.. బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. చెన్నూరులో ఎమ్మెల్యే బాల్కసుమన్‌కి మద్దతుగా మందమర్రి, చెన్నూరులో భారీ ర్యాలీ చేపట్టారు. నిజామాబాద్‌లోఎమ్మెల్యే బిగాలగణేశ్ గుప్తాకు మరోసారి అవకాశమివ్వడంతో.. పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి.
CM KCR Announced BRS MLA Candidates List : నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు.. మరోసారి అవకాశం ఇవ్వడంతో కార్యకర్తలు, అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్(KCR Announced 115 BRS Candidates) ప్రకటించడంతో బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders).. నిజాంసాగర్ చౌరస్తాలో పెద్దఎత్తున టపాసులు పేల్చారు. మిఠాయిలు పంచి బ్యాండ్ మేళాల మధ్య నృత్యాలు చేశారు. కేసీఆర్‌ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని.. బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
BRS Focus on Telangana Assembly Elections 2023 : చింతాప్రభాకర్ పేరును కేసీఆర్(KCR Announced First List of BRS Candidates) ప్రకటించడంతో.. సంగారెడ్డిలో భుజాలపై ఎత్తుకొని అభిమానులు సందడి చేశారు. మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డికి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు మిఠాయిలు తినిపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అభ్యర్థిగా పాడి కౌశిక్‌రెడ్డిని ప్రకటించడంతో బాణసంచా పేల్చారు. కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్ పేరు ప్రకటనతో శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అభిమానులు.. బీఆర్ఎస్ కార్యకర్తలు బస్టాండ్ కూడలి వద్ద కేక్‌కట్ చేసి, టపాసులు పేల్చారు.
అంబరాన్నంటిన అభిమానుల సంబురాలు: ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బడే నాగజ్యోతి పేరు ప్రకటించడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు భారీ ర్యాలీ నిర్వహించారు. డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా.. మళ్లీ రెడ్యానాయక్ పేరును ప్రకటించడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. వైరాలో బానోతు మదన్‌లాల్‌కి కేటాయించడంతో బాణసంచా కాల్చి సందడి చేశారు. భద్రాచలంలో డాక్టర్ తెల్లం వెంకట్రావు అభిమానులు, కార్యకర్తలు ప్రదర్శన చేశారు. ఇల్లందులో ఇల్లందు గడ్డ.. హరిప్రియ అడ్డా అంటూ.. ఎమ్మెల్యే హరిప్రియ అనుచరులు కేరింతలు చేశారు.
BRS Announced Candidates List Constituency Wise : ఆలేరు అభ్యర్థిగా గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి పేరు ప్రకటనతో యాదాద్రిలో ఆమె అనుచరులు.. వైకుంఠ ద్వారం వద్ద సీఎం కేసీఆర్‌కి పాలాభిషేకం చేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డికి మద్దతుగా మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. కోదాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అనుచరులు ద్విచక్రవాహన ర్యాలీ చేశారు. హుజూర్‌నగర్‌లో శానంపూడి సైదిరెడ్డి.. అభిమానులు, కార్యకర్తలు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరికిషోర్ కుమార్ అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు సంబురాల్లో మునిగితేలారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నోముల భగత్ అభిమానులు సందడిచేశారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థిగా మూడోసారి ప్రకటించడంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాంప్ కార్యాలయం వద్ద.. గులాబీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
CM KCR Contests from Two Seats : ఈసారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ