తల్లి చనుబాలతోనే శిశువు ఆరోగ్యకరంగా ఉంటుందని హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ శిఖా గోయల్ అన్నారు. చనుబాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా శ్రేయస్కరమని పేర్కొన్నారు. ఆ పాలలో పోషకాలతో పాటు రోగనిరోధకశక్తి ఉంటుందని వివరించారు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ జోన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చనుబాల నిల్వ కేంద్రాన్ని శిఖా గోయల్ ప్రారంభించారు.
ఈ కేంద్రం ప్రయాణాలు చేసే పిల్లల తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శిఖా గోయల్ అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ ఎన్వీ హనుమంతరెడ్డి, రైల్వే అధికారి ప్రదీప్ రాఠోడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వ్యాక్సిన్ కోసం ఎగబడిన సిబ్బంది... నిబంధనలు బేఖాతరు