ETV Bharat / state

మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ధ్యానం ఎంతో ఉపయోగం: బ్రహ్మకుమారీలు - బ్రహ్మకుమారీల ధ్యాన కేంద్రం తాజా వార్త

ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని, ప్రస్తుత కరోనా భయానక స్థితి నుంచి విముక్తి పొందేందుకు ధ్యానం ఎంతగానో ఉపకరిస్తుందని మౌంట్​ అబు బ్రహ్మకుమారీ ఇంఛార్జ్ మంజు తెలిపారు. హైదరాబాద్​లోని మారేడ్​పల్లి ఏర్పాటు చేసిన ధ్యాన కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్​ ప్రారంభించారు.

brahma kumaris yoga center opened at marredpally in hyderabad
మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ధ్యానం ఎంతో ఉపయోగం: బ్రహ్మకుమారీలు
author img

By

Published : Nov 8, 2020, 5:49 PM IST

హైదరాబాద్​ మారేడ్​పల్లిలో రాజయోగా పేరుతో ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. దానిని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రారంభించారు. మంత్రిని మౌంట్​ అబు బ్రహ్మకుమారీ ఇంఛార్జ్​ మంజు సన్మానించారు. నగరంలో దాదాపు 70 ధ్యాన కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు. ధ్యానం వల్ల కలిగే అనుభూతి ప్రశాంతతను ఇస్తుందని, కొవిడ్ వల్ల ఏర్పడిన భయానక పరిస్థితుల నుంచి మనఃశాంతి కలిగిస్తుందన్నారు. తమ సందేశాల ద్వారా భయాన్ని వదిలి ధైర్యంగా జీవించాలనే సంకల్పాన్ని కలిగిస్తున్నామన్నారు.

కేవలం బ్రహ్మకుమారీలు మాత్రమే కాకుండా ఇతరులు కూడా ధ్యాన కేంద్రాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రపంచ శాంతి కోసం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని మంజు తెలిపారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ కథనానికి సీఎం సతీమణి స్పందన.. పేద కుటుంబానికి ఆర్థిక సాయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.