నిన్న ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ యువతిని హైదరాబాద్ ఒమ్నీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుంది. మెడ చుట్టూ తీవ్రగాయాలు కావడం వల్ల వైద్యులు నిన్న సాయంత్రం శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆమెకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. 48 గంటలు గడిస్తేగాని ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు తెలిపారు.
నిందితుడి ఆరోగ్యం మెరుగు:
వెంకటేశ్ దాడి చేసే సమయంలో ప్రాణాలు రక్షించుకునేందుకు బాధితురాలు చేతులు అడ్డుపెట్టడం వల్ల రెండు చేతివేళ్లు కూడా విరిగాయి. వైద్యులు చేతివేళ్లకు శస్త్రచికిత్స చేశారు. యువతి గొంతు కోసిన అనంతరం నిందితుడు వెంకటేశ్ కూడా బాత్రూమ్లోకి వెళ్లి మణికట్టు వద్ద కత్తితో కోసుకున్నాడు. ప్రస్తుతం అతను ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
ఇప్పటికే దిల్సుఖ్నగర్లోని బృందావన్ లాడ్జీలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించిన వాటిని పరిశీలిస్తున్నారు. నిందితుడు వెంకటేశ్ కోలుకున్నాక అతని నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: కత్తితో గొంతుకోసిన ప్రేమోన్మాది...