భవనం పైనుంచి పడి బాలుడి మృతి - boy search fo kite in hyderabad
చెట్టుకు తట్టుకున్న గాలిపటాన్ని తీసే క్రమంలో ఓ బాలుడు మూడు అంతస్తుల భవనంపై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని మోండా మార్కెట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఓంకార్
కర్ణాటకు చెందిన ఉమేశ్ కుమార్ దంపతులు హైదరాబాద్ మోండా మార్కెట్ పీఎస్ పరిధిలోని సెకండ్ బజార్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కార్తిక పౌర్ణమికి సెలవు కావడం వల్ల పెద్ద కుమారుడు ఓంకార్ భవనంపై నుంచి గాలిపటం ఎగరేశాడు. గాలి పటం చెట్టుకు చిక్కుకోవడం వల్ల దాన్ని తీసేందకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రాణం తీసిన గాలిపటం..
ఇదీ చూడండి: 3 రోజుల కస్టడీకి కీర్తిరెడ్డి
Intro:సికింద్రాబాద్ యాంకర్.. ఇంటి పక్కనే ఉన్న చెట్టుకు తట్టుకున్న గాలిపటాన్ని తీసే క్రమంలో ఓ బాలుడు మూడు అంతస్తుల భవనం పై నుండి కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. ఈ ఘటన మోండామార్కెట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది..సెకండ్ బజార్ లో నివాసం ఉంటున్న కర్ణాటకకు చెందిన ఉమేష్ కుమార్ కు ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు అతని పెద్దకుమారుడు ఓంకార్ పాస్పోర్ట్ ఆఫీస్ వద్ద ఉన్న ఠాగూర్ హోమ్ స్కూల్లో నాలుగవ తరగతి చదువుతున్నాడు.. కార్తీక పౌర్ణమి సందర్భంగా సెలవు కావడంతో అతను మూడు అంతస్తుల భవనం పై ఆడుకుంటున్న సమయంలో చెట్టుకు చిక్కుకున్న గాలిపటాన్ని తీసేందుకు ప్రయత్నించాడు..చెట్టుకు చిక్కుకున్న గాలిపటం దూరంగా ఉండటంతో అతను జారి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు..హుటాహుటిన అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా సాయంత్రం చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు..అతని మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారుBody:VamshiConclusion:7032401099
Last Updated : Nov 12, 2019, 11:55 PM IST