Roads damaged by heavy floods In Hyderabad : హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు వాహనదారుల పట్ల మృత్యు పాశంలా వెంటాడుతున్నాయి. బుధవారం జరిగిన రెండు వేర్వేరు చోట్ల ఒకే తరహాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏనిమిదేళ్ల చిన్నారి నిన్న మృతి చెందగా.. డిగ్రీ చదువుతున్న మరో యువతి చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.
ఇదీ జరిగింది: కొంపల్లి నుంచి బోయిన్పల్లి బస్‌స్టాప్ వరకు ఎమ్.ఎన్.ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న వైష్ణవిని తన తండ్రి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో రహదారిపై ఇసుక మేట వేయడంతో బైక్ అదుపుతప్పి పడిపోయింది. దీంతో తండ్రి, కుమార్తె ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో సుచిత్ర వైపు నుంచి వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ వైష్ణవి, ఆమె తండ్రిపై నుంచి వెళ్లిపోయింది.
Roads damaged In Hyderabad : ప్రమాదంలో వైష్ణవి నడుముతో పాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె తండ్రికి సైతం తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వైష్ణవి.. ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తండ్రి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
Bachupally Road Accident : ఇదే తరహాలో బుధవారం మరో ప్రమాదం జరిగింది. బాచుపల్లి రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో ఓ చిన్నారిని స్కూల్‌కు తీసుకెళ్తున్న కిషోర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం గుంతల రోడ్డులో పడి స్కిడ్ అయ్యింది. దీంతో తండ్రి, కుమార్తె ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఇదే క్రమంలో వెంగంగా వచ్చిన ఓ స్కూల్ బస్సు చిన్నారి దీక్షిత తలపై నుంచి వెళ్లిపోయింది. ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందంగా.. కిషోర్‌కు బలమైన గాయాలయ్యాయి. రెండు ప్రమాదాల్లో వరద ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లు కారణంగా స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైన అధికారులు మొద్దు నిద్ర వదలి హైదరాబాద్ రోడ్లను మరమ్మతుల చేయించాలని వాహన చోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రోడ్డుపై ఇసుక మేటలు తొలగించడయ్యా..: మరోవైపు రాష్టవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇటి వలే కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జాతీయ రహదారులు సైతం దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి గుంతలతో దర్శనిమిస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయపడుతున్నారు. రోడ్లపై ఇసుక మేట వేయడంతో బైక్‌లు అదుపు తప్పుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి జాతీయ రహదారిని మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి: