గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి నగరం అతలాకుతలమైంది. పలు కాలనీలు పూర్తిగా జలదిగ్బంధం అయ్యాయి. బోయిన్పల్లిలోని సెయిల్ కాలనీ పూర్తిగా నీటమునగడంతో కాలనీ వాసులు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో పోలీసులు వారికి అండగా నిలిచారు.. పడవల ద్వారా ఆహారపొట్లాలను తరలించి కాలనీవాసులకు వితరణ చేసి మానవత్యాన్ని చాటుకున్నారు.
గత రెండు రోజులుగా సమయానికి తిండి లేక.. కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని నీటిని తరలించే ఏర్పాట్లు చేసి కరెంటు పునరుద్ధరించాలని కోరుతున్నారు.. అదేవిధంగా కొన్ని రహదారుల వద్ద నీరు నిలిచి గుంతలు ఏర్పడ్డ చోట తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు మట్టి తెచ్చి గుంతలు పూడ్చారు.
ఇదీ చూడండి: పడవల్లో వరద బాధితుల తరలింపు