జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బౌద్ధనగర్ డివిజన్లో తమకు ఏ పార్టీతో పోటీ లేదని... భారీ మెజార్టీతో గెలుస్తామని తెరాస అభ్యర్థి కంది శైలజ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్సిగుట్ట, బౌద్ధ నగర్, అంబర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. తనకు ఓటు వేస్తే ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ డివిజన్లో చేపట్టిన అన్ని అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువయ్యాయని ఆమె తెలిపారు. వరద బాధితులకు అందించిన ఆర్థిక సాయం భాజపా వల్ల మధ్యలో ఆగిపోయిందని... ఎన్నికలు ముగిసిన వెంటనే బాధితులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. బౌద్ధ నగర్లోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ... అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని ఆమె స్పష్టం చేశారు. బౌద్ధ నగర్ ప్రజలు తెరాసకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'దేశంలోని మొత్తం నిఘానేత్రాల్లో 65 శాతం హైదరాబాద్లోనే...'