ETV Bharat / state

ఇద్దరూ శిరస్త్రాణం ధరించాల్సిందే... లేదంటే ఇక అంతే..!

బైక్​పై ఎక్కడికైనా వెళ్తున్నారా...! మీతో పాటు మీ వాహనంపై మరెవరైనా వస్తున్నారా...! ఇద్దరూ కలిసి బైక్​పై ప్రయాణిస్తున్నారా...? అయితే ధ్రువీకరణ పత్రాలతో పాటు హెల్మెట్​ కూడా ఉండాలి అనే విషయం తెలుసు కదా...! ఇది ముందు నుంచి తెలిసిన విషయమే కదా కొత్తగా అడుగుతున్నారేంటీ అనుకుంటున్నారా...? ఇన్నాళ్లు హెల్మెట్ డ్రైవర్​కు మాత్రం ఉంటే సరిపోయేది... కానీ ఇప్పుడు వెనకాల కూర్చునే వారికి కూడా శిరస్త్రాణం​ ఉండాల్సిందే అంటున్నారు హైదరాబాద్​ పోలీసులు.

both are wear helmets on two wheeler vehicles is must
ఇద్దరూ శిరస్త్రాణం ధరించాల్సిందే...
author img

By

Published : Jun 17, 2020, 4:07 PM IST

బైక్​పై ఇద్దరు రయ్​ రయ్ ​మంటూ వెళుతున్నారా? డ్రైవింగ్ చేస్తున్న వారికి మాత్రమే హెల్మెట్ ఉందా? వాహనానికి సైడ్‌ మిర్రర్‌లు లేవా?అయితే ట్రాఫిక్ చలాన్లు కట్టేందుకు సిద్ధంగా ఉండండి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు మరిన్ని కఠిన చర్యలు అమలు చేసేందుకు సిద్ధం అయ్యారు.

హైదరబాద్‌ నగర పరిధిలోని రోడ్డు ప్రమాదాలలో 80శాతం వరకు.. వెనక కూర్చున్న వారికీ హెల్మెట్‌ లేకపోవడం, సైడ్‌ మిర్రర్‌ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. మూడు కమిషనరేట్ల పరిధిలో వీటిని నివారించేందుకు ఇకపై మరిన్ని కఠిన చర్యలు అవసరమని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ముందుగా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ద్విచక్ర వాహన ప్రమాదాల్లో వెనుక కూర్చున్న వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతుల... చున్నీ, దుప్పట్టా లాంటివి వెనుక చక్రంలో ఇరుక్కుపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

గత కొద్ది రోజులుగా ద్విచక్ర వాహన ప్రమాదాల్లో వెనుకల కూర్చున్న వారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతులు చున్నీ.. దుప్పట్టా లాంటివి వీల్‌లో ఇరుక్కుపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

సగటున 50 ప్రమాదాలలో 45 ప్రమాదాలు వాహనాలకు సైడ్‌ మిర్రర్‌ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని పోలీసుల అధ్యయనంలో తేలింది. యు టర్న్ తీసుకునేప్పుడు... ఒకలైన్‌ నుంచి మరో లైన్‌లోకి వెళ్లేటప్పుడు... సైడ్‌ మిర్రర్‌ లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోంది. సైలెన్సర్‌లు మార్చి, పెద్ద పెద్ద శబ్దాలు చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వెనకాల కూర్చున్న వారికి హెల్మెట్ కానీ, వాహనానికి సైడ్​ మిర్రర్​లు కానీ లేకపోయినా పోలీసులు చలానాలు విధిస్తున్నారు. హైదరాబాద్​లోని మూడు కమిషనరెట్ల పరిధిలో పోలీసులు ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒక్క సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలోనే రూ.4.5 లక్షల చలాన్లు విధించామని పోలీసులు తెలిపారు. ఈ చర్యలతో అప్రమత్తమైన నగరంలోని ద్విచక్రవాహనదారులు... సుమారు 60 శాతం మంది వెనక కూర్చున్న వారు సైతం హెల్మెట్లు ధరిస్తున్నారని తెలిపారు.

ఈ విధంగా వాహనదారులు ట్రాఫిక్​ నియమాలు పాటించి, పోలీసులకు సహకరిస్తూ... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌ను ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి : ఏ చట్టం ప్రకారం పింఛన్లలో కోత విధించారు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.