ETV Bharat / state

Booster dose: రాష్ట్రంలో నేటి నుంచి బూస్టర్ డోస్ టీకా పంపిణీ

Booster dose
Booster dose
author img

By

Published : Apr 18, 2023, 7:06 PM IST

Updated : Apr 19, 2023, 6:25 AM IST

19:04 April 18

తెలంగాణలో నేటి నుంచి బూస్టర్ డోస్ టీకా పంపిణీ

Booster dose vaccine distribution in telangana

Booster dose vaccine distribution in telangana: భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపత్యంలో మరోమారు బూస్టర్ డోస్‌ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. గత కొంత కాలంగా కోవిడ్ వ్యాక్సిన్‌ల కొరత కారణంగా బూస్టర్ డోస్‌ల పంపిణీ నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలే స్వయంగా కోవిడ్ వ్యాక్సిన్‌లు కొనుగోలు చేయాలని ఇటీవల సూచించింది. దాంతో రాష్ట్రంలో నేటి నుంచి బూస్టర్ డోస్ టీకాల పంపిణీ మొదలుకానుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ "బయోలాజికల్‌ - ఈ” నుంచి 5 లక్షల కోర్బివ్యాక్స్ డోసులు కొనుగోలు చేసిన సర్కారు.. వాటిని బూస్టర్ డోస్ కోసం అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. కోవ్యాక్సిన్‌, కోవీషీల్డ్‌ టీకాలను మొదటి, రెండు డోసులు తీసుకున్న వారికి హెటిరోలోగస్ విధానంలో మూడో డోస్‌గా కోర్బివ్యాక్స్ ఇవ్వనున్నట్టు స్ఫష్టం చేసింది. అర్హులైన వారు తప్పక టీకా తీసుకోవాలని ప్రకటించింది.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కల్గిస్తోంది. దీనిపై ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.. పలు సూచనలు చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్‌లలో కేసులు పెరుగుతున్నాయని.. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు లేవని పేర్కొంది. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వయో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానికి ఆరోగ్య కేంద్రాలను వెళ్లి టెస్టులు చేసుకోవాలని తెలిపింది.

కొవిడ్​పై కేంద్రం ఊరటనిచ్చే సంకేతాలు..: దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసులు కొన్ని రోజులుగా పెరుగుతున్న వేళ.. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు ఊరటనిచ్చే వార్త చెప్పాయి. భారత్‌లో కొవిడ్ ఎండమిక్‌ దశకు చేరిందని అంచనా వేశాయి. కేసులు మరో 10 నుంచి 12 రోజులు పాటు పెరిగి తర్వాత క్రమంగా తగ్గిపోతాయని చెప్పాయి. రోజువారీ కేసులు ఎక్కువగా నమోదువుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య బాగా తక్కువగా ఉందని వెల్లడించాయి.

ఇవీ చదవండి:

Last Updated : Apr 19, 2023, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.