గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామ పత్రాల దాఖలుకు మూడు రోజులే సమయం ఉండడం వల్ల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి పోటీ పడుతున్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్ నుంచి మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి నామ పత్రాలు దాఖలు చేశారు.
ఈ డివిజన్లో తెరాస రెబల్స్ కూడా నామినేషన్ వేశారు. కప్రా ఎన్నికల కార్యాలయల వద్ద కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకపోవటంతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. చర్లపల్లి డివిజన్లో అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా కట్టుబడి ఉంటామన్నారు శ్రీదేవి. మేయర్ లేకున్నా స్థానిక నాయకులతో పనులు చేయించామని చెప్పారు.
ఇదీ చదవండి: పేరుండి ఇక్కడ లేని వారి వివరాలు ఇవ్వాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం