సికింద్రాబాద్లోని చారిత్రాక శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఈ నెల 21, 22న జరుగనున్నాయి. 21న బోనాలు, సోమవారం 22న రంగం కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర పభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని.. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తోందని మహంకాళి ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం జాతరకు 35లక్షల భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, ఈసారి జాతరకు 35లక్షలకు మించి తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. బోనాలు సమర్పించే మహిళలకు రెండు ప్రత్యేక క్యూలైన్లు, సాధారణ భక్తులకు కూడా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశామని వివరించారు.
ఇవీ చూడండి: "తెలంగాణలో తెరాస పతనం ప్రారంభమైంది"