తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా తగ్గడం వల్ల చలి పెరుగుతోంది.
మంగళవారం తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 15.5, మెదక్లో 16.8, ఆదిలాబాద్లో 17.8, హైదరాబాద్లో 20.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. చలి ఇంకా పెరిగే సూచనలున్నాయి.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ