హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలో పీస్ అవెన్యూ రెసిడెంట్స్ వేల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శిబిరంలో పలువురు స్వచ్చందంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. రేపు పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించే హరితహారం కార్యక్రమనికి సీఎం కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని సూచించారు.
ఇదీ చదవండి:స్ఫూర్తి: అతడు వీరప్పన్ దోస్త్.. ఆమె ఓ దోషి.. అయినా!