మానవసేవే మాధవసేవ అంటూ.. పేద ప్రజలకు సేవ చేయడంలోనే పరమార్థముందని బోయిన్పల్లి పారామెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. సుధాకర్ పేర్కొన్నారు. క్రిస్మస్ను పురస్కరించుకొని కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
మదర్ థెరిసా స్ఫూర్తితో ప్రతి క్రిస్మస్కు పలు సేవా కార్యక్రమాలు చేపడుతునట్లు డా. సుధాకర్ పేర్కొన్నారు. పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మహమ్మారి అంతరించిపోయి ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి జీసస్ అందర్నీ రక్షించాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: జీవనజ్యోతి వద్ద క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి