ETV Bharat / state

ఉద్ధృతంగా బ్లాక్‌ ఫంగస్‌.. షుగర్‌ను అదుపు చేస్తే నియంత్రణ - doctor tarjani vivek dave

ఎన్నడూ లేనంత ఎక్కువగా మ్యూకర్‌ మైకోసిస్‌(బ్లాక్‌ ఫంగస్‌) కేసులను చూడాల్సి వస్తోందని ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విద్యాలయంలో సీనియర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ తర్జనీ వివేక్‌ దవే అన్నారు. గతంలో ఏడాదిలో ఒకటో రెండో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వస్తే.. ఇప్పుడు రోజుకు 10-12 వరకూ వస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఈ రెండువారాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆమె తెలిపారు.

black-fungus-control-if-sugar-is-controlled-said-by-specialist
ఉద్ధృతంగా బ్లాక్‌ ఫంగస్‌.. షుగర్‌ను అదుపు చేస్తే నియంత్రణ
author img

By

Published : May 26, 2021, 7:31 AM IST

గతంతో పోల్చితే వైట్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య నామమాత్రమేననీ, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు మాత్రం ఊహించని విధంగా నమోదవుతున్నాయని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విద్యాలయంలో సీనియర్ వైద్యనిపుణులు డాక్టర్ తర్జనీ వివేక్ దవే అన్నారు. కొవిడ్‌ చికిత్సలో భాగంగా మితిమీరి స్టిరాయిడ్‌లను వినియోగించిన ఫలితంగా ఈ దుస్థితి ఎదురవుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. తొలి దశలోనే మ్యూకర్‌ మైకోసిస్‌కు చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా షుగర్‌ వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ను కూడా నియంత్రించవచ్చని సూచించారు. ‘ఆర్బిటో ఫేసియల్‌ ఫ్రాక్చర్స్‌’ చికిత్సలో, ‘మైగ్రేటెడ్‌ ఆర్బిటల్‌ ఇన్‌ప్లాంట్స్‌’ అమరికలో డాక్టర్‌ దవే నిష్ణాతురాలు. 60కి పైగా వైద్య వైజ్ఞానిక వ్యాసాలను ఆమె సమీక్షించారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నేత్ర వైద్యంపై అనేక ప్రసంగాలు చేశారు. రాష్ట్రంలో మ్యూకర్‌ మైకోసిస్‌ కేసులు క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో డాక్టర్‌ తర్జనీ దవేతో ప్రత్యేక ముఖాముఖి.

అకస్మాత్తుగా బ్లాక్‌ ఫంగస్‌ తీవ్ర రూపం దాల్చడానికి కారణాలేమిటి?

సాధారణంగానే కరోనా వైరస్‌ సోకిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనికి తోడుగా చక్కెర వ్యాధి ఏ మాత్రం నియంత్రణలో లేకపోవడం, కొవిడ్‌ సమయంలో స్టిరాయిడ్స్‌ ఎక్కువగా వాడటం వల్ల బాధితుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా మ్యూకర్‌ మైకోసిస్‌ సులభంగా దాడిచేస్తుంది. కొవిడ్‌కు ముందు కూడా బ్లాక్‌ ఫంగస్‌ కేసులున్నా.. అప్పుడవి నామమాత్రమే. కానీ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. అయితే ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదు. కొవిడ్‌ సమయంలోనూ, కోలుకున్న తర్వాత కూడా రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఫిజీషియన్‌ను సంప్రదిస్తూ అవసరమైన చికిత్స పొందాలి.

ఎటువంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి

బ్లాక్‌ ఫంగస్‌తో వచ్చిన రోగులను పరీక్షించినప్పుడు వారి రక్తంలో షుగర్‌ స్థాయులు గణనీయంగా పెరిగి ఉంటున్నాయి. పైగా వీరు కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్‌ ఔషధాలను విపరీతంగా వాడి ఉన్నారు. దీంతో బాగా ముదిరిన తర్వాత వచ్చిన కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.

వీరికి చికిత్స ఎలా

బ్లాక్‌ ఫంగస్‌ సోకిన అన్ని కేసుల్లోనూ సైనస్‌ సర్జరీ అవసరమవుతోంది. యాంటీ ఫంగల్‌ ఇంజక్షన్లను, మాత్రలను ఇవ్వాల్సి వస్తోంది. ప్రధానంగా ‘లైపొసొమల్‌ యాంఫొటెరిసిన్‌-బి’ ఇంజక్షన్లు వాడాలి. కన్ను వెనుక భాగంలోను.. అలాగే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందితే ఆ పరిసరాల్లో కూడా ఇంజక్షన్‌ ఇవ్వాలి. ఇన్‌ఫెక్షన్‌ మెదడుకు చేరితే చాలా ప్రమాదం. ఇప్పుడు వస్తున్న కేసుల్లో 70-80 శాతం మెదడుకు విస్తరించిన తర్వాత వచ్చినవే ఉంటున్నాయి. సైనస్‌ దశలోనే వైద్యం చేయించుకోవడం ఉత్తమం. కన్ను పక్కన ఫంగస్‌ విస్తరిస్తే కొన్నిసార్లు కన్ను తీసేయాల్సి ఉంటుంది. మెదడుకు వ్యాప్తి చెందితే మెరుగైన ఫలితాలు రావడం కొంత కష్టమే.

ఎవరిలో ఎక్కువ ప్రమాదం

మధుమేహం నియంత్రణలో లేనివారు, కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్‌ ఔషధాలు ఎక్కువగా వాడినవారిలో ఈ ముప్పు అధికం. కొవిడ్‌ చికిత్సలో భాగంగా ఆక్సిజన్‌ అవసరమైన వారిలోనూ ముప్పు ఎక్కువే. ముఖ్యంగా వృద్ధులు, మూత్రపిండాల మార్పిడి చేసుకున్నవారు, హెచ్‌ఐవీ రోగులకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించుకోవాలి. అవసరమైతే తప్ప స్టిరాయిడ్‌ ఔషధాలను వినియోగించొద్దు. రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే తక్కువవుతుంటే.. నిపుణుల పర్యవేక్షణలో స్టిరాయిడ్స్‌ వాడాలి. ఆక్సిజన్‌ మాస్కులను కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి.

తొలిదశలోనే గుర్తించడం..ముందస్తు జాగ్రత్తలపై...

తొలిదశలో గుర్తించడం వల్ల వ్యాధి ప్రమాదకరంగా మారకుండా జాగ్రత్తపడొచ్చు. ముక్కు గట్టి పడటం, సైనసైటిస్‌, తలనొప్పి, అకస్మాత్తుగా కంటి చూపు తగ్గడం వంటి ప్రధాన లక్షణాలను గుర్తించాలి. కన్నుపై ఎర్రబడినా, పళ్ల నొప్పి తీవ్రమవుతున్నా వైద్యుణ్ని సంప్రదించాలి. నోటిని, ముక్కును శుభ్రంగా ఉంచుకోవాలి. సీటీ స్కాన్‌ చేయడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించవచ్చు. మరింత లోతుగా విశ్లేషణ కోసం కొన్నిసార్లు ఎమ్మారై స్కాన్‌ కూడా చేయాల్సి వస్తుంది.

ఇదీ చూడండి: చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు ఉంటుంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.