మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. రామమందిర నిర్మాణం నిధుల సేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
హైదరాబాద్‌లోని రహ్మత్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ మినీ-హబ్‌ను ప్రారంభించి... తిరిగి వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను భాజపా ప్రతినిధి నీలం రత్నంతో పాటు పదిమంది యువమోర్చా కార్యకర్తలు కలిసి అడ్డుకున్నారు.
పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి యువమోర్చా కార్యకర్తలను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కేటీఆర్ కృతజ్ఞతలు